బీబీపేట: కామారెడ్డి జిల్లా బీబీపేటలోని తిమ్మయ్యగారి సుశీల నారాయణ రెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అత్యంత నాణ్యమైన విద్య అందించడంతో పాటు వసతులు కూడా బాగున్నాయ ని సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు వివరించిన సందర్భం శుక్రవారం హైదరబాద్‌లోని రవీంద్రభారతిలో చోటుచేసుకుంది. రాష్ట్రంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలను అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక చేశారు. ఆ అవార్డును సీఎం, గవర్నర్ చేతుల మీదుగా బీబీపేట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మూల రవీంద్రారెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా వేదికపైకి హెచ్‌ఎం రవీంద్రారెడ్డి వెళ్లిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు పరిచయం చేసి పాఠశాల గొప్పతనం గురించి వివరించారు. పాఠశాల హెచ్‌ఎం రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ అవార్డు వచ్చిందని పేర్కొన్నారు.


