తెయూ(డిచ్‌పల్లి):తెలంగాణ విశ్వవిద్యాలయం పార్ట్‌టైం లెక్చరర్ డాక్టర్ ఆర్ సాయిలక్ష్మి రచించిన ‘నిజామాబాద్ జిల్లా సీ్త్రల సాహిత్యం–ఒక పరిశీలన’ (పీహెచ్‌డీ గ్రంథం) పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. తెయూ ఆర్ట్స్ కళాశాల మినీ సెమినార్ హాల్‌లో ఈ పుస్తకాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలుగుశాఖ అధ్యక్షులు, బీవోఎస్ చైర్మన్ కనకయ్య, లావణ్య, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణచక్రవర్తి, పీఆర్‌వో రమణచారి, పున్నయ్య, ఆర్ట్స్ డీన్ మహమ్మద్ మూసా ఖురేషీ, పుప్పాల రవీందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
డిచ్‌పల్లి: జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్న మానవత సదన్ ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భుజంగరావు అన్నారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని మానవతసదన్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదన్ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం నిజంగా అభినందనీయమని, కొందరు ఉద్యోగాలలో స్థిరపడటం అదర్శప్రాయమన్నారు. మిగతా విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సదన్ చిన్నారులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిస్వార్థంగా గత పదకొండు సంవత్సరాలుగా సదన్ పర్యవేక్షకులుగా సుధాకర్ రావు, పదేళ్లపాటు కేర్‌టేకర్‌గా అందె రమేష్ చేసిన సేవలను అభినందించారు. డీఈవో అశోక్, ఎంఈవో, సదన్ ఇన్‌చార్జి నరేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


