మన మడిలో యూపీ దిహాడీదార్‌ | - | Sakshi
Sakshi News home page

మన మడిలో యూపీ దిహాడీదార్‌

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

వరినాట్లకు స్పెషలిస్టులు

‘మీరు నారు పోసి పెట్టండి.. మేము గంటల వ్యవధిలో నాట్లు వేసేస్తాం’ అంటున్నారు యూపీ దిహాడీలు (రోజువారీ కూలీలు). వరినాట్లు వేయడంలో స్పెషలిస్టులుగా పేరున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కూలీలు ఉమ్మడి జిల్లాకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. గ్రూపులుగా విడిపోయి వరినాట్లు వేస్తున్నారు. 18 మంది కలిసి రోజుకు 7 ఎకరాల్లో నాట్లు పూర్తి చేస్తూ ఎకరానికి రూ.4,500 తీసుకుంటున్నారు. సమయం, డబ్బులు ఆదా కావడంతోపాటు యూపీ కూలీల పనిలో కచ్చితత్వం ఉంటుందని, నారును వరుస క్రమంలో నాటడంతో దిగుబడి బాగుటుందని రైతులు అంటున్నారు. వర్ని, చందూర్‌ ప్రాంతాలకు వలస వచ్చిన సుమారు 450 మంది కూలీలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జోరుగా వరినాట్లు వేస్తున్నారు. బాన్సువాడ డివిజన్‌లోని బిచ్కుంద శివారులో వరినాట్లు వేస్తున్న యూపీ కూలీలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.

– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నిజామాబాద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement