ఆడుడు ఆడుడే.. | - | Sakshi
Sakshi News home page

ఆడుడు ఆడుడే..

Jun 14 2026 7:16 AM | Updated on Jun 14 2026 7:16 AM

చర్యలు తప్పవు..

● పది రోజుల క్రితం నస్రుల్లాబాద్‌లో పేకాటఅడ్డాపై దాడి చేసిన పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.9,280 నగదు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

● వారం క్రితం బీర్కూర్‌ మండలం బైరాపూర్‌ చెరువు స మీపంలోని పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.2,110 నగదు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

● 20 రోజుల క్రితం గాంధారి మండలం పొతంగల్‌ కలాన్‌ శివారులో నిర్వహిస్తున్న ఓ పేకాట స్ధా వరంపై దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులో కి తీసుకున్నారు. రూ.10వేల నగదును సీజ్‌ చేశారు.

కామారెడ్డి క్రైం : జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. పోలీసులకు పట్టుబడుతున్నా ‘ఆడుడు ఆడుడే..’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు పేకాటరాయుళ్లు. దాడులు జరుగుతాయని, ఆర్థికంగా నష్టమేనని తెలిసినా జూదంపై మోజు తగ్గడం లేదు. పేకాట మోజులో పడి ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయి వీధిన పడుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడాలేకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పేకాట స్థావరాలు కొనసాగుతున్నాయి. ఓ వైపు పోలీసులు దాడలు చేస్తుండగా, మరోవైపు పేకాటరాయుళ్లు అడ్డాలు మారుస్తూ జూదం ఆడుతున్నారు. కేసులు నమోదవుతున్నా మార్పు రావడం లేదు. ప్రత్యేక నిఘా సారించి పేకాటను పూర్తిగా నియంత్రించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

కేసులు.. అరెస్ట్‌లు..

జిల్లాలోని ఆయా పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 98 పేకాట కేసులు నమోదు కాగా, 525 మందిని అరెస్ట్‌ చేశారు. 2025లో 305 కేసుల్లో 1,733 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే 2023లో 155 కేసులు, 2024లో 214 పేకాట కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో వందల సంఖ్యలో పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట చేసి కోర్టులకు హాజరుపర్చారు. స్థానిక పోలీసులే కాకుండా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు సైతం పేకాట స్థావరాలపై నిఘా సారించాయి. అయినా గుట్టుచప్పుడు కాకుండా జూదం జోరుగా నడుస్తోంది. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు సైతం పట్టుబడిన సందర్భాలున్నాయి. కొంత కాలం క్రితం భిక్కనూరులోని ఓ క్లబ్‌లో నిర్వహించిన పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి పరిస్థితికి అద్దం పడుతోంది.

కాసులు కురిపిస్తున్న ఆట

‘కేటు’ పేరిట గేమ్‌కు కొంత మొత్తం డబ్బు వ చ్చే అవకాశం ఉండడంతో కొంత మంది బడా బాబులు పేకాట నిర్వాహణను వ్యాపారంగా మార్చుకున్నారు. మామూళ్లు ముట్టజెప్పడంలో ఆరితేరిన పేకాటస్థావరాల నిర్వాహకులు ఏ మాత్రం భయం లేకుండా అపార్ట్‌మెంట్‌లు, హోటళ్లను అడ్డాలుగా మార్చుకుంటున్నారు. జి ల్లా కేంద్రంలో ముఖ్యంగా నిర్మాణ దశలో ఉన్న భవనాలు, ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్‌లు, శివా రు ప్రాంతాల్లోని ప్రముఖ హోటళ్లు పేకాటకు అడ్డాలుగా మారాయనే ఆరోపణలున్నాయి. కామారెడ్డితోపాటు ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌, మ ద్నూర్‌, జుక్కల్‌, బాన్సువాడ, బీర్కూర్‌, గాంధారి, సదాశివనగర్‌, భిక్కనూరు తదితర ప్రాంతాలు పేకాటకు పెట్టింది పేరు.

చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారి పై చర్యలు తప్పవు. పేకాటపై ప్రత్యేక ని ఘా ఉంది. పేకాట వ ల్ల కలిగే నష్టాలు, న మోదయ్యే కేసులపై గ్రామస్థాయిలో అవగాహ న కల్పిస్తున్నాం. పేకాట ఆడినా, నిర్వహించి నా సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం.

– నరహరి, పట్టణ ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి

పట్టుబడుతున్నా మారని

పేకాటరాయుళ్ల తీరు

అడ్డాలు మారుస్తూ జిల్లాలో

జోరుగా జూదం

పెడదారి పడుతున్న యువత

ఈ ఏడాది ఇప్పటికే 98 కేసులు..

525 మంది అరెస్ట్‌

ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement