83 సార్లు రక్తదానం చేసిన బాలు | - | Sakshi
Sakshi News home page

83 సార్లు రక్తదానం చేసిన బాలు

Jun 14 2026 7:16 AM | Updated on Jun 14 2026 7:16 AM

జిల్లా కేంద్రానికి చెందిన రక్తదాతల సమూహం నిర్వాహకుడు, లెక్చరర్‌ బాలు ఇప్పటివరకు 83 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జిల్లాలో ఎవరికి రక్తం అవసరం ఉన్నా వెంటనే స్పందిస్తూ, ఇతర దాతలను సమన్వయం చేస్తూ ఎందరో ప్రాణాలను కాపాడారు. ఈయన సేవలను గుర్తించిన ప్రభుత్వం, గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ చేతుల మీదుగా ‘బంగారు పతకం’తో సత్కరించింది. 2015లో రాష్ట్ర ప్రభుత్వం ‘ఉత్తమ సామాజిక సేవా పురస్కారం’ అందించింది. జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ’రక్తవీర్‌ పురస్కారం’ అందుకున్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం తక్కువ సమయంలో 5 వేల యూనిట్లు, ఏడాది కాలంలో 2,530 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement