‘ఎర్లీ బర్డ్‌’ను సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

‘ఎర్లీ బర్డ్‌’ను సద్వినియోగం చేసుకోండి

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

‘ఎర్లీ బర్డ్‌’ను సద్వినియోగం చేసుకోండి మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు పీఎంతో వర్చువల్‌ భేటీలో పాల్గొన్న విద్యార్థి

కామారెడ్డి టౌన్‌ : ఎర్లీ బర్డ్‌ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకుని ఆస్తి పన్ను చెల్లింపులో 5 శా తం రాయితీని పొందాలని మున్సిపల్‌ ఇన్‌ చార్జి కమిషనర్‌, ఆర్డీవో గిరి సూచించారు. ఎనిమిదో వార్డు పరిధిలోని జీవదాన్‌ ఆస్పత్రి యా జమాన్యం ముందస్తుగా రూ. 7.12 లక్షల ఆస్తి పన్నును శుక్రవారం ఇన్‌చార్జి కమిషనర్‌ సమ క్షంలో చెల్లించింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రజలు సకాలంలో పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ శ్రీధర్‌రెడ్డి, ఆర్‌ఐ లలిత, సిబ్బంది పాల్గొన్నారు.

కామారెడ్డి రూరల్‌: కామారెడ్డి పట్టణంలోని రై లు పట్టాలపై ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా.. పోలీసులు కాపాడారు. వివరాలిలా ఉ న్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్‌ గ్రామానికి చెందిన శోభ కుటుంబ సమస్యల తో ఆత్మహత్య చేసుకోవాలని భావించి తాహె ర్‌ గార్డెన్‌ ప్రాంతంలో రైల్వే పట్టాలపైకి వచ్చింది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైలు వచ్చేలోగా కానిస్టేబుళ్లు రామకృష్ణ, నర్సింలు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కుటుంబ సమస్యల కారణంగానే మహిళ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలుస్తోందని సీఐ నరహరి తెలిపారు.

రుద్రూర్‌: మండలంలోని ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రావ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వర్చువల్‌గా భేటీ అయ్యింది. ‘మై భారత్‌ బడ్జెట్‌–2026’ అంశంపై మూడు దశలుగా నిర్వహించిన వర్చువల్‌ పోటీలలో పాల్గొన్న శ్రావ్య ప్రతిభ కనబర్చి ఎంపికైంది. ఈనెల 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లోని కన్నశాంతి వనంలో నిర్వహించిన జాతీయ స్థాయి ‘వర్చువల్‌ డైలాగ్‌ విత్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ కార్యక్రమంలో శ్రావ్య పాల్గొందని కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. పీఎంతో వర్చువల్‌ భేటీలో పాల్గొన్న శ్రావ్యను అధ్యాపకులు, సహ విద్యార్థులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement