సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్‌ విడుదల మాల ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ సొసైటీ రాష్ట్ర ఈసీ మెంబర్‌గా సంతోష్‌ ఆర్టీసీ సమ్మె సన్నాహక మీటింగ్‌లను విజయవంతం చేయాలి

మద్నూర్‌(జుక్కల్‌): ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించాలని సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజపాలన–ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ పా ల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రూపొందించిన 99 రోజుల ప్రణాళికలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు,మహిళలకు ఉచిత బస్సు,సన్నరకం వడ్లకు బో నస్‌ తదితర విషయాలపై ఆమె ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సంక్షేమ పథకాలు అందతున్న తీరును తెలుసుకున్నారు.అలాగేడోంగ్లీ మండల కేంద్రంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు.

ఎల్లారెడ్డి రూరల్‌: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరు కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపిక కోసం నోటిఫికేషన్‌ విడుదలైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్‌ కుమార్‌ తెలిపారు. కో–ఆప్షన్‌ పదవి కోసం ఎంపిక చేసే అభ్యర్థులు ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉండాలని,ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు క లిగి ఉండి, మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండా లని తెలిపారు.కో–ఆప్షన్‌ సభ్యులపద కాలం ఐదు సంవత్సరాల పాటు ఉంటుందని అన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తుతో కావాల్సిన ధ్రువ పత్రాలను ఈనెల17 నుంచి 28 సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చునని తెలిపారు.

బాన్సువాడ:రాష్ట్ర మాల ఎడ్యు కేషనల్‌ సొసైటీ ఈసీ మెంబర్‌ గా బాన్సువాడ మండలం దే శాయిపేట్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు అయ్యాల సంతోష్‌ను నియమించారు. రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, రిటైర్డ్‌ ఎస్పీజాన్‌ వెస్లీల ఆధ్వర్యంలో మాల చైత న్యం కోసం నిరంతరం శ్రమిస్తున్నందుకు రాష్ట్ర నా యకత్వం గుర్తించి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించా రని సంతోష్‌ తెలిపారు. బాబా సాహెబ్‌ అంబేడ్క ర్‌, మహాత్మా జ్యోతీరావు పూలే సూచించిన ఆశయ సాధన కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు.

కామారెడ్డి టౌన్‌ :ఆర్టీసీ కార్మికుల సమస్యల ప రిష్కారం కోసం ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం నిజామాబాద్‌ రీజియన్‌లోని అన్ని డిపోల్లో సమ్మె సన్నాహక గేట్‌ మీటింగ్‌లను విజయవంతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకుడు వి.డి దాస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021, 2025 పీఆర్సీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.మహాలక్ష్మి పథకం వల్ల పనిభారం పెరిగి నా,జీతాలు మాత్రం పదేళ్ల క్రితం నాటివే ఇస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నేడు ఆర్మూర్‌లో ఉదయం 6:30 గంటలకు, నిజామాబాద్‌ 9:30, బోధన్‌ 12:30, బాన్సువాడలో మధ్యాహ్నం 2:30, కామారెడ్డిలో సాయంత్రం 6 గంటలకు ఆర్టీసీ డిపోల్లో జరిగే మీటింగ్‌లకు హాజరవ్వాలని పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement