ప్రపంచంలోనే అతి పెద్ద జనగణన కార్యక్రమానికి మన దేశం సిద్ధమయ్యింది. డేటా గోప్యతకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి స్వీయ గణనకూ అవకాశం కల్పించారు. దీంతో ఎక్కడినుంచైనా జనగణనలో పాల్గొనేందుకు అవకాశం లభించనుంది. – ఎల్లారెడ్డి
దేశంలో ప్రతి పదేళ్లకోసారి జనగణన చేపడతారు. చివరిసారి 2011లో జనాభా లెక్కించారు. 2021లో కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీనిని ప్రభుత్వం 2026 –27 సంవత్సరాలలో నిర్వహిస్తోంది. ఈసారి డిజిటల్ విధానంలో జనగణన చేయనున్నారు. ఇది రెండు దశలలో సాగనుంది. మొదటి దశలో ఇళ్ల వివరాలు, లెక్కింపు చేపట్టనున్నారు. మన రాష్ట్రంలో మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ గణన కార్యక్రమాన్ని చేపడతారు. రెండో దశలో అసలైన జనాభా లెక్కింపు జరుగుతుంది. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది.
స్వీయ జనగణన..
జనాభా లెక్కల అధికారులు ఇళ్ల వద్దకు వచ్చి నప్పుడు లేకపోవడం, ఉద్యోగ, వ్యాపార రీ త్యా వేరే ప్రాంతాలలో నివసిస్తున్న వారికి ప్ర భుత్వం ఈసారి కొత్తగా స్వీయ జనగణనకు అవకాశం ఇచ్చింది. డిజిటల్ సెన్సెస్‌లో భాగంగా ప్రజలు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. జనాభా లెక్కింపు అధికారులు ఇంటి వద్దకు రాక ముందే ప్రజలు తమ వివరాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. స్వీయ జన గణనకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి రాష్ట్రానికి నిర్ణీత సమయం కేటాయించింది. తెలంగాణలో స్వీయ జనగణనకు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అవకాశం ఇచ్చారు. సొంతూళ్లకు దూరంగా ఉంటున్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
ఎలా నమోదు చేయాలంటే..
సెల్ఫ్ ఎన్యుమరేషన్ కోసం https://se. census.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ సైట్‌లోకి వెళ్లి రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకుని క్యాప్చా నమోదు చేయాలి. తర్వాత కుటుంబ యజమాని పేరు, మొబైల్ నంబర్ ధ్రువీకరించాలి. భాషను ఎంపిక చేసుకుని ఓటీపీ ఎంటర్ చేయాలి. లొకేషన్ వివరాలను నమోదు చేశాక కుటుంబానికి సంబంధించిన వివరాల గురించి 33 ప్రశ్నలను నింపాల్సి ఉంటుంది. ఇందులో సొంత ఇల్లు ఉందా? అద్దె ఇంట్లో ఉంటున్నారా? ఎల్‌పీజీ గ్యాస్ వాడుతున్నారా? కారు లేదా బైక్ ఉందా లాంటి ప్రశ్నలుంటాయి. అన్ని వివరాలను నమోదు చేశాక ఒకసారి ప్రివ్యూ చూసుకుని ఫైనల్ సబ్మిషన్ బటన్ నొక్కాలి. 11 అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ జనరేట్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎన్యుమరేట్ ఇంటికి వచ్చినపుడు ఈ ఐడీ చెబితే సరిపోతుంది. ఇచ్చిన వివరాలలో ఏవైనా తప్పులు, మార్పులు ఉంటే ఎన్యుమరేటర్ సమక్షంలో సరి చేసుకునే అవకాశం ఉంటుంది.
డేటా గోప్యతకు ప్రాధాన్యత
ఎక్కడి నుంచైనా
‘జనగణన’కు అవకాశం
సొంతూళ్లలో ఉండనివారికి
ఉపయుక్తం


