అమ్మ చెంతకు ‘బెజ్జంకి’ పరివారం.. | - | Sakshi
Sakshi News home page

అమ్మ చెంతకు ‘బెజ్జంకి’ పరివారం..

Apr 10 2026 10:09 AM | Updated on Apr 10 2026 10:09 AM

అమ్మ చెంతకు ‘బెజ్జంకి’ పరివారం..

కామారెడ్డికి చెందిన బెజ్జంకి గోదావరిదేవి, లింబాద్రి దంపతుల కు ఐదుగురు సంతానం. పెద్ద కొడుకు రాజేందర్‌ సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో చీఫ్‌ లోకోపైలట్‌ కాగా, రెండో కొడుకు సురేశ్‌ ఎల్‌ఐసీలో డివిజనల్‌ మేనేజర్‌. మూడో కుమారుడు వైద్య ఆరోగ్య శాఖలో సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌గా, నాలుగో కొడుకు నరేశ్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో టీమ్‌ లీడర్‌గా ఉన్నారు. కూతురు జయశ్రీ అటవీ శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌. ఐదుగురికి కలిపి 12 మంది సంతానం. లింబాద్రి చనిపోగా, గోదావరి దేవి కొడుకులతో కలిసి ఉంటోంది. కాగా ఉద్యోగరీత్యా ఎక్కడ ఉన్నా.. పండుగలు, సెలవు రోజుల్లో అమ్మ ఎక్కడ ఉంటే అక్కడికి చేరుకుంటారు. పండగలు, ఫంక్షన్లు అన్నీ ఉమ్మడిగానే చేసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement