కామారెడ్డి అర్బన్: జిల్లాలో మక్క, జొన్న, పొ ద్దు తిరుగుడు, వరి పంటలు చేతికి వచ్చినందు న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షు డు పైడి విఠల్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువా రం బీకేఎస్ ప్రతినిధులు అడిషనల్ కలెక్టర్ విక్ట ర్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ శశిధర్‌రెడ్డిలను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విఠల్‌రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. యూరియా యాప్ ను రద్దు చేయాలని, రైతుభరోసా నిధులను వెంటనే జమ చేయాలని, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20 వేలు ప రిహరం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్య క్రమంలో బీకేఎస్ నాయకులు సాయిరెడ్డి, చిన అంజన్న, బండారు రాంరెడ్డి, ఆనందరావు, బుచ్చయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రెగ్యులర్ 2, 4, 6 సెమిస్టర్లతోపాటు బ్యాక్‌లాగ్ 1, 3, 5 సెమిస్టర్ల పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. రోజు పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని వైస్ ప్రిన్సిపల్, పరీక్షల నియంత్రణ అధికారి కిష్టయ్య తెలిపారు. విద్యార్థులు కనీసం అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
కామారెడ్డి టౌన్ : సామాజిక పింఛన్ల పెంపు హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వికలాంగుల హక్కు ల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. మాట తప్పి ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పింఛన్లను పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం జిల్లా నాయకులు బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోని సహకార బ్యాంకుల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 90 వేల మందికి రూ. 1,967 కోట్ల రుణాలు ఇచ్చామని డీసీసీబీ జనరల్ మేనేజర్ అనుపమ తెలిపారు. ఇందులో పంటలకు సంబంధించి రూ. 687 కోట్లు, కర్షక్‌మిత్రకు సంబంధించి రూ. 262 కోట్లు, బంగారు ఆభరణాలకు సంబంధించి రూ. 725 కోట్ల రుణాలు ఉన్నాయన్నారు. నాగిరెడ్డిపేటలో నూతన భవనంలోకి మార్చిన సహకార బ్యాంకును గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. రూరల్ హౌసింగ్ లోన్స్ ద్వారా ఖాతాదారులకు ఇళ్ల నిర్మాణాల కోసం రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కనీసం రెండెకరాల భూమి కలిగిన రైతులకు ఇళ్ల నిర్మాణాల కోసం 11.5 శాతం వడ్డీతో రుణాలు ఇస్తామన్నారు. ఆమె వెంట డీజీఎం సుమమాల, మాల్తుమ్మెద సొసైటీ మాజీ చైర్మన్ రాజిరెడ్డి తదితరులున్నారు.
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు గాను జిల్లాలోని వివిధ కోర్టులు గురువారం 68 మందికి శిక్షలు విధించాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని ఆయా కోర్టులలో హాజరుపర్చగా ఐదుగురికి రెండు రోజులు, ఇద్దరికి ఒకరోజు జైలు శిక్షతో పాటు మొత్తం 68 మందికి కలిపి రూ. 83 వేల జరిమానా విధించారని ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.


