
ధర్నాకు ప్రజాసంఘాల మద్దతు
కామారెడ్డి అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యలపై ఈ నెల 5న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) ఈ నెల 5న నిర్వహించే ధర్నాకు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆదివారం స్థానిక కర్షక్ బీఎడ్ కళాశాల నిర్వహించిన కార్యక్రమంలో బామ్‌సెఫ్, అంబేడ్కర్ యువజన సంఘం, ఇండియన్ లాయర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, లంబాడా హక్కుల పోరాట సమితి, బహుజన సంఘాల ఐక్యవేదిక, బీసీ సంక్షేమ సంఘం, భారత్ ముక్తి మోర్చా, బహుజన విద్యార్థి మోర్చాలు తమ మద్దతు ప్రకటించాయి. 5న మంగళ వారం ఉదయం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాలో పాల్గొంటాయని ఆయా సంఘాల నాయకులు ప్రకటించారు. నాయకులు ఆకుల బాబు, దుబాసీ నరేందర్, శ్యాంసన్, రెవల్లి శంకర్, దాస్‌రాం నాయక్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.