కోర్సులు సరే.. అధ్యాపకులేరి? | - | Sakshi
Sakshi News home page

కోర్సులు సరే.. అధ్యాపకులేరి?

Aug 4 2025 3:43 AM | Updated on Aug 4 2025 3:43 AM

కోర్స

కోర్సులు సరే.. అధ్యాపకులేరి?

భిక్కనూరు: మండల కేంద్రంలో పది ఎకరాల విస్తీ ర్ణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కోర్సులు ఉన్నా లెక్చరర్లు లేకపోవడంతో విద్యార్థు లు నష్టపోతున్నారు. భిక్కనూరులో 1984 సంవత్సరంలో ఎంపీసీ బైపీసీ హెచ్‌ఈసీ, సీఈసీ కోర్సులతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ప్రారంభించారు. అప్పట్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కళాశాల కొనసాగింది. 1994లో హుషారిలాల్‌ విరాళంగా అందజేసిన పది ఎకరాల భూమిలో భవనం నిర్మించి అందులోకి మార్చారు. అయితే జువాలజీ లెక్చరర్‌ లేకపోవడంతో బైపీసీలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపలేదు. అదే సమయంలో ఇక్కడి బైపీసీ గ్రూప్‌ను జగిత్యాలకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అప్పటినుంచి మూడు గ్రూపులతో కళాశాల కొనసాగుతోంది. 1997 కెమిస్ట్రీ అధ్యాపకుడిని బదిలీ చేసిన ఇంటర్‌ బోర్డ్‌.. ఆ లెక్చరర్‌ స్థానంలో ఎవరినీ పంపించలేదు. కనీసం కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ను కూడా నియమించలేదు. ఈ కళాశాలలో సుమారు 28 ఏళ్లుగా కెమిస్ట్రీ లెక్చరర్‌ లేకపోవడం గమనార్హం. గెస్ట్‌ లెక్చరర్‌లతో పాఠాలు చెప్పిస్తున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

మూడు దశాబ్దాల తర్వాత..

కళాశాలలో బైపీసీ గ్రూప్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని విద్యార్థులు ఏళ్లుగా కోరుతున్నారు. బడిబాటలో నూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇదే విషయాన్ని చె ప్పారు. దీంతో స్పందించిన ఇంటర్‌ బోర్డ్‌ ఈ ఏడా ది బైపీసీ గ్రూపును తిరిగి ప్రారంభించింది. ప్రస్తు తం ఈ కళాశాలలో హెచ్‌ఈసీ ప్రథమ సంవత్సరంలో ఏడుగురు, ద్వితీయ సంవత్సరంలో ఏడుగురు విద్యార్థులున్నారు. సీఈసీలో ప్రథమ సంవత్సరంలో 22 మంది విద్యార్థుండగా.. ద్వితీయ సంవత్సరంలో 18 మంది ఉన్నారు. ఎంపీసీ ఫస్టియర్‌లో 32 మంది విద్యార్థులు చేరగా.. ద్వితీయ సంవత్సరంలో ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఈ ఏడాదే బైపీసీ పునఃప్రారంభమైంది. ప్రస్తుతం 23 మంది విద్యార్థులతో నడుస్తోంది. అయితే కెమిస్ట్రీ, జువాలజీ లెక్చరర్లను నియమించకపోవడంతో గెస్ట్‌ లెక్చరర్ల తో నెట్టుకొస్తున్నారు. ఇతర కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లతో వారానికి రెండు మూడు రోజులు పాఠా లు చెప్పిస్తున్నారు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రధాన సబ్జెక్టులకు రెగ్యులర్‌ లెక్చరర్లను నియమించకపోతే ఎలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.

ప్రహరీ లేక ఇబ్బందులు

కళాశాలకు ప్రహరీ లేదు. దీంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దీనికి తోడు రాత్రి పూట మద్యం ప్రియులు ఇక్కడికి వచ్చి మద్యం సేవిస్తున్నారు. దీంతో కళాశాల పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. కళాశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని, కెమిస్ట్రీ, జువాలజీ సబ్జెక్టులకు రెగ్యులర్‌ అధ్యాపకులను నియమించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

28 ఏళ్లుగా కెమిస్ట్రీ లెక్చరర్‌ పోస్ట్‌ ఖాళీ

ఈ ఏడాది బైపీసీ పునఃప్రారంభం..

జువాలజీ లెక్చరర్‌ను నియమించని బోర్డ్‌

గెస్ట్‌ లెక్చరర్లతో పాఠాలు..

నష్టపోతున్న విద్యార్థులు

ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం

కెమిస్ట్రీ, జువాలజీ లెక్చరర్లు లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతి థి అధ్యాపకులతో పాఠాలు చెప్పిస్తున్నాం. విద్యార్థులకు నష్టం జరగకుండా చూస్తున్నాం. రెగ్యులర్‌ లెక్చరర్ల ను నియమించాలని ఉన్నతాధికారులను కోరాం.

– జ్యోతిర్మణి రాధాదేవి, ప్రిన్సిపాల్‌

రెండుమూడు రోజులే..

కెమిస్ట్రీ లెక్చరర్‌ లేకపోవడంతో ఇబ్బంది అవుతోంది. వారానికి రెండు మూడు క్లాసులే నడుస్తున్నాయి. రెగ్యులర్‌ లెక్చరర్‌ ఉంటే బాగుంటుంది. ఇంటర్‌ బోర్డ్‌ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రెగ్యులర్‌ లెక్చరర్‌ను నియమించాలి.

– శ్రీశాంత్‌ ఎంపీసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి

కోర్సులు సరే.. అధ్యాపకులేరి?1
1/2

కోర్సులు సరే.. అధ్యాపకులేరి?

కోర్సులు సరే.. అధ్యాపకులేరి?2
2/2

కోర్సులు సరే.. అధ్యాపకులేరి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement