
దేవుళ్ల పేరుతో ఓట్లడిగితే నమ్మరు
● బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు
● నాలుగు ముక్కల ఆటతో బీఆర్‌ఎస్
భూస్థాపితమైంది
● పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
● ముగిసిన జనహిత పాదయాత్ర
ఆర్మూర్ : దేవుళ్ల పేరుతో ఓట్లడిగితే ప్రజలు నమ్మరని, ఏ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరి స్థితి లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. రా ష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చిన బీఆర్‌ఎస్ నాలుగు ము క్కల ఆటతో భూస్థాపితం అయిపోయిందన్నారు. రాబో యే 15 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టిన రెండు రోజుల ‘జనహిత పాద యాత్ర’ ఆదివారం ముగిసింది. ముందుగా ఆలూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారా ల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీ తక్కతో కలిసి శ్రమదానం చేశారు. అక్కడి నుంచి ఆర్మూర్ మండలం అంకాపూర్‌కు చేరుకున్నారు. గ్రామంలో పాదయాత్ర చేసి, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం నిజామాబాద్ రూరల్ నియోజకవ ర్గం పరిధిలోని జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ శివారులో ఉన్న యమునా గార్డెన్స్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీ కో సం ఎన్నో త్యాగాలు చేసిన పాత కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని, అలాగే కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తా మని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసుకున్నామని త్వరలోనే వ్యవసాయ కళాశాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కూడా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఇన్‌చార్జి మంత్రి సీతక్క, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, లక్ష్మీకాంతారావు, ఎమ్మె ల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.