
రాహుల్ స్ఫూర్తితోనే ‘జనహిత’
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకొనే జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణలో శాసీ్త్రయ పద్ధతిలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటా యించేలా కృషి చేయడంతో అందరూ తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తున్నారన్నారు. బీజేపీ మాత్రం నాగ్‌పూర్ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ దేశ ప్రజలను మతం పేరిట విడదీస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో నిర్వహించే ఆందోళనలకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.