● బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి
బిచ్కుంద(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇసుక కావాలని వచ్చిన లబ్ధిదారులకు వెంటనే అనుమతి పత్రం అందించి.. ఇసుక చవకగా అందే విధంగా చూడాలని తహసీల్దార్ వేణుగోపాల్‌ను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. మండల తహసీల్ కార్యాలయాన్ని బుధవారం ఆమె సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఇసుక అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. ఎలాంటి రికార్డులు పెండింగ్‌లో పెట్టవద్దన్నారు. భూభారతి రికార్డుల్లో తప్పులు లేకుండా చూడాలని, రైతుల సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు.
వ్యాక్సినేషన్‌పై నిర్లక్ష్యం తగదు
బాన్సువాడ రూరల్: చిన్నారులకు వ్యాక్సినేషన్ ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి విద్య అన్నారు. బుధవారం ఆమె బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. చిన్న పిల్లలకు వ్యాక్సిన్లు సమయానుసారం వేయించడం తప్పనిసరని, వ్యాక్సిన్ల ప్రాముఖ్యతను తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో వ్యాక్సినేషన్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సీహెచ్‌వో దయానంద్, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని వినతి
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకులు డిమాండు చేశారు. ఈ సందర్భంగా బుధవారం పార్టీ నాయకులు తహసీల్దార్ సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు భీమ్‌రావు, ఉపాధ్యక్షుడు విశ్వేశ్వర్ శర్మ, నాయకులు కృష్ణ, నాన్యనాయక్, సాయిలు, వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచి
బీఆర్‌ఎస్‌లో చేరిక
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మల్లుపేట గ్రామానికి చెందిన సొసైటీ మాజీ డైరెక్టర్, రైతుబంధు మాజీ అధ్యక్షుడు ఆకారం హన్మండ్లు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బుధవారం మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ పడిగెల రాజేశ్వ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హన్మాండ్లు మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు సక్రమంగా అమలు చేశాడని.. కానీ ఇప్పడు కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా చేయడం లేదని ఆరోపించారు. మాజీ జెడ్పీటీసీ రాజేశ్వర్‌రావు, రామారెడ్డి మాజీ ఎంపీపీ దశరథ్‌రెడ్డి, నాయకులు సాయాగౌడ్, శ్రీనివాస్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు ‘ఇసుక’ అనుమతి ఇవ్వాలి
ఇందిరమ్మ ఇళ్లకు ‘ఇసుక’ అనుమతి ఇవ్వాలి
ఇందిరమ్మ ఇళ్లకు ‘ఇసుక’ అనుమతి ఇవ్వాలి