
నిజాంసాగర్‌లోకి 1,828 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,828 క్యూసె క్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మెదక్ జిల్లా ఘనపురం ఆనక ట్టతో పాటు హల్దీ వాగు ద్వారా ప్రాజెక్టుకు వరద వ స్తోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1,391 అడుగుల (4.47 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.
పోచారంలోకి తగ్గిన ఇన్‌ఫ్లో
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 4,784 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా సాయంత్రానికి 1,800 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.110 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు.

నిజాంసాగర్‌లోకి 1,828 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో