
తండ్రి కల నెరవేరింది
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన బుక్కావార్ రాంచందర్ రేషన్ డీలర్‌గా పనిచేస్తూ కొడుకును ఉన్నత చదువులు చదివించి డాక్టర్‌ను చేశాడు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చిన వెనకడుగు వేయకుండా కష్టపడి చదివించాడు. ప్రస్తుతం బాన్సువాడ ఏరియా ఆస్పత్రితో కాంట్రాక్ట్ బేసిక్‌పై డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. కూతురు బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, బీజెడ్సీ చేస్తుంది. మా వంశంలో ఒక్కరైన డాక్టర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాము, కొడుకు సిద్ధార్థ్ డాక్టర్ పట్టా పొందిన రోజు మా కల నిజమైంది అని రాంచందర్ పేర్కొన్నాడు. తన కొడుకు బిచ్కుందలో వైద్యుడిగా సేవలు అందించే విధంగా తండ్రిగా నా వంతు కృషి చేస్తానన్నారు.