దుకాణంలో చోరీకి యత్నం | - | Sakshi
Sakshi News home page

దుకాణంలో చోరీకి యత్నం

May 19 2025 2:28 AM | Updated on May 19 2025 2:28 AM

దుకాణ

దుకాణంలో చోరీకి యత్నం

ఖలీల్‌వాడి: నగరంలోని ఒకటో పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆర్కే బిల్డర్స్‌లో దుండగులు శనివారం అర్ధరాత్రి చోరీకి యత్నించినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి ఆదివారం తెలిపారు. దుండగులు బీరువా, లాకర్‌ ధ్వంసం చేయగా ఎలాంటి వస్తవులు చోరీకి గురి కాలేదన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్‌ టీమ్‌ ద్వారా ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. దుకాణ నిర్వాహకుడు గుజ్జ రవికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.

పేకాట స్థావరంపై దాడి

మద్నూర్‌: మండలంలోని అంతాపూర్‌లో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై విజయ్‌కొండ తెలిపారు. గ్రామంలో శనివారం రాత్రి పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన నలుగురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో రూ. 5,640 నగదు, నాలుగు ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సై వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.

ఒకరిపై కేసు నమోదు

లింగంపేట: మండలంలోని భవానిపేట శివారులోని పంట చేనులో బండరాళ్లను పగులగొట్టడానికి సదరు వ్యక్తి బ్లాస్టింగ్‌ చేయడంతో చుట్టు పక్కల ఇళ్లు దెబ్బతిన్నాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన దర్శనం సిద్ధిరాములుకు సంబంధించిన భూమిలో ల్యాండ్‌ డెవలప్‌ చేయడానికి బ్లాస్టింగ్‌ చేశారు. దీంతో బండరాళ్లు ఎగిరి పలువురి ఇళ్లపై పడడంతో ఇళ్లు, బైక్‌, కారు ధ్వంసమయ్యాయి. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి ఎస్సై, సిబ్బందితో చేరుకొని పరిశీలించారు. బ్లాస్టింగ్‌ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో గేదె మృతి

రుద్రూర్‌: పొతంగల్‌ శివారులో ఆదివారం విద్యుత్‌ షాక్‌ తగిలి గేదె మృతి చెందింది. గంగారాం అనే రైతుకు చెందిన గేదె వ్యవసాయ పొలం వద్ద మేత మేస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎర్త్‌వైర్‌కు తగిలి విద్యుత్‌ షాక్‌కు గురైంది. విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన కోరాడు.

దుబ్బాకలో..

ధర్పల్లి: మండలంలోని దుబ్బాక గ్రామంలో నాగుల ఎర్రన్నకు చెందిన గేదె విద్యుత్‌ షాక్‌తో ఆదివారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ సమీపంలో మేత మేస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ రూ.60 వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరాడు.

దుకాణంలో చోరీకి యత్నం1
1/2

దుకాణంలో చోరీకి యత్నం

దుకాణంలో చోరీకి యత్నం2
2/2

దుకాణంలో చోరీకి యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement