కొనసాగుతున్న యోగా శిక్షణ తరగతులు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంప్‌లో భాగంగా శనివారం యోగా శిక్షణ తరగతులు నిర్వహించినట్లు మండల కోర్సు ఇన్‌చార్జి వహీద్‌సిద్దిఖీ తెలిపారు. ఈ సందర్భంగా యోగా శిక్షణలో భాగంగా సూర్యనమస్కారం, ధనురాసనం, శీర్షాసనం, చేతు బందహాసనం, ప్రాణయామం, ధ్యానం చేయించినట్లు తెలిపారు. యోగా శిక్షణలో ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో యోగా నిపుణులు నర్సింలు, ఉపాధ్యాయులు ప్రభాకర్, రాజులు, యూసుఫ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలబారిన పడొద్దు
సదాశివ నగర్(ఎల్లారెడ్డి): సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై రంజిత్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి హాజరై అవగాహన కల్పించారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహారించిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ సంతోష్ కుమార్, ఎంఈవో యోసేఫ్ తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట మున్నూరు కాపు
సంఘం అధ్యక్షుడిగా శ్రీకాంత్
రాజంపేట: రాజంపేట మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడిగా దుబ్బని శ్రీకాంత్ నియామకమయ్యారు. జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీను నియామక పత్రాన్ని దుబ్బని శ్రీకాంత్ కు అందజేశారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెట్టిగాడిఅంజయ్య, బచ్చగారి నర్సింలు, తుల బసవయ్య, నాయిని శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న యోగా శిక్షణ తరగతులు
కొనసాగుతున్న యోగా శిక్షణ తరగతులు


