తగాదాలకు దూరంగా ఉండడం అభినందనీయం
భిక్కనూరు : తగాదాలు, పోలీసు కేసులు లేకుండా జీవించడం అభినందనీయమని జిల్లా న్యాయసేవా ధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి టి.నాగరాణి పేర్కొన్నారు. శనివారం ఆమె ర్యాగట్లపల్లి గ్రామా న్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. 15 ఏ ళ్లుగా గ్రామంలో ఒక్క పోలీస్ కేసు లేకుండా ఉండడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతిదానికి ఘర్షణలు పడుతూ పోలీస్ కేసులు పెట్టుకుంటున్న ఈ కాలంలో ఒక్క పోలీస్ కేసు లేకుండా ప్రజలు కలసిమెలసి ఉండడం అభినందనీయమన్నారు. మూడేళ్ల క్రితం ర్యాగట్లపల్లి గ్రామం ఒక్క కేసు లేని గ్రామంగా ఎంపికైందన్నారు. అలాగే ఈ గ్రామం ఇప్పటివరకు అ లానే ఉందన్నారు. ఒక్క కేసు నమోదు కాకుండా ఉ న్న విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులకు నివేదించేందుకోసం గ్రామాన్ని సందర్శించడానికి వచ్చానన్నారు. యువత పాశ్చాత్య సంస్కృతి మోజులో ప డి వ్యసనాలకు బానిసగా మారుతోందని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి తమ పిల్లలను వా టికి దూరంగా ఉంచాలని సూచించారు. గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో ఏవైనా సమస్యలు ఎదురైతే ఎలా పరిష్కరించుకుంటారని ప్రశ్నించగా.. రాజీ మార్గాన్ని ఎంచుకుంటామని వారు స మాధానమిచ్చారు. తమ పెద్దలు చూపిన మార్గంలో పయనిస్తామని యువకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి చట్టాలపై ప్రజలకు అ వగాహన కల్పించారు. కార్యక్రమంలో నేతలు నరేందర్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, సిద్దరామురెడ్డి, కోర్టు సూపరింటెండెంట్ చంద్రసేన్‌రెడ్డి పాల్గొన్నారు.
15 ఏళ్లుగా కేసుల్లేని గ్రామంగా
ర్యాగట్లపల్లి నిలిచింది
జిల్లా న్యాయసేవాధికార సంస్థ
కార్యదర్శి నాగరాణి


