ఆర్టీసీ క్యూఆర్ కోడ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి టౌన్: ఆర్టీసీ నూతనంగా అమలు చేస్తున్న క్యూఆర్ కోడ్ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో కామారెడ్డి ఆర్టీసీ డీఎం కరుణశ్రీ ఆర్టీసీ క్యూఆర్ కోడ్ కీచైన్‌లను జిల్లా అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆర్టీసీకి సంబంధించి పూర్తి సమాచారం అరచేతిలో ఉంటుందన్నారు. ఆర్టీసీ యాప్‌లు, వెబ్‌సైట్ వివరాలు, టికెట్ బుకింగ్, బస్సుల టైంటేబుల్, ఇతర వివరాలు ఈ క్యూఆర్ కోడ్‌తో తెలుస్తాయన్నారు. తాజాగా క్యూఆర్ కోడ్‌తో ముద్రించిన ఈ కీచైన్‌లను ప్రయాణికులకు ఉచితంగా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్‌నాయక్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీపీఆర్‌వో భీమ్‌కుమార్, ఆర్టీవో వీణ తదితరులు పాల్గొన్నారు.


