26 ఏళ్లుగా అంబలి కేంద్రం ఏర్పాటు
బాన్సువాడ : వేసవిలో బాటసారుల దప్పికను తీర్చాలనే ఉద్దేశంతో పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త నాగులగామ వెంకన్న తన తండ్రి గిర్మయ్య జ్ఞాపకార్థంగా 26 ఏళ్లుగా అంబలి కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. వేసవి కాలం పూర్తయ్యే వరకు అంబలి వితరణ చేయనున్నారు. 26 ఏళ్లగా తాడ్కోల్ చౌరస్తా వద్ద అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం చుట్టు పక్కల గ్రామాలు, మండల కేంద్రాల నుంచి జనం ఏదో ఓ పని కోసం బాన్సువాడకు వస్తారు. ప్రతి గురువారం బాన్సువాడలో సంత ఉండడంతో వందలాది గ్రామీణ ప్రాంతాల ప్రజలు వస్తారు. సంతకు వెళ్లాలంటే తాడ్కోల్ చౌరస్తా నుంచే వెళ్లాల్సి ఉంటుంది. సంతకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు బస్సులు, ఆటోలలో వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ అంబలి తాగుతారు. ప్రతి రోజు 600 నుంచి 680 గ్లాసుల అంబలి పంపిణీ చేస్తే ప్రతి గురువారం మాత్రం 800 నుంచి 850 గ్లాసులు పంపిణీ చేస్తారు. ప్రతి రోజు 15 –20 కిలోల జోన్న పిండి ఉడకబెట్టి అంబలి చేస్తారు. సంతరోజు మాత్రం 30–35 కిలోల జోన్న పిండిని ఉడకబెట్టి అంబలి తయారు చేస్తారు. ఈ అంబలి కేంద్రం జూన్ మొదటి వారం వరకు కొనసాగుతుంది.
తండ్రి జ్ఞాపకార్థంగా అంబలి వితరణ
ప్రయాణికులు, ప్రజలు,
వాహనదారులకు తీరుతున్న దాహం
దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో..
మా నాన్న దివంగత గిర్మయ్య జ్ఞాపకార్థం బాన్సువాడలో అంబలి కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి రోజు బాన్సువాడకు వచ్చే పేద ప్రజల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించాం.
– నాగులగామ వెంకన్న, వ్యాపార వేత్త బాన్సువాడ
26 ఏళ్లుగా అంబలి కేంద్రం ఏర్పాటు


