‘భూభారతి డెస్క్ వర్క్ నిర్వహించాలి’
లింగంపేట: భూభారతి డెస్కు వర్క్‌ను వే గంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ విక్ట ర్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. శనివా రం ఆయన పోతాయిపల్లి, నల్లమడుగు, కో మట్‌పల్లి గ్రామాల్లో భూభారతి సర్వేకు సంబంధించిన డెస్కు వర్క్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూ భారతి చట్ట ప్రకారం భూ సర్వే నిర్వహించి అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులకు కనీస వసతులు, సౌకర్యాలు కల్పించాలని, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. ఆలయన వెంట రెవెన్యూ, సింగిల్ విండో సిబ్బంది, రైతులు ఉన్నారు.
‘2.80 లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం సేకరించాం’
నాగిరెడ్డిపేట: జిల్లాలో ఇప్పటివరకు సుమా రు 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు డీసీవో రామ్మోహన్ తెలిపారు. శనివారం ఆయన వాడి, చీనూర్, నాగిరెడ్డిపేట, మాల్తుమ్మెద, గోలిలింగాల, లింగంపల్లికలాన్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూకం చేసిన ధాన్యం సంచులపై టార్పాలిన్లను కప్పి ఉంచాలని, ధాన్యం బస్తాలను వెంటవెంటనే రైస్‌మిల్లులకు పంపాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ఇప్పటివరకు 2,06,061 మెట్రిక్ టన్నుల ధాన్యం, ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో 73,195 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. సుమారు 2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.4.87 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఆయన వెంట మానిటరింగ్ అధికారి నర్సింలు, మాల్తుమ్మెద సొసైటీ సీఈవో సందీప్‌కుమార్ ఉన్నారు.
18 నుంచి బజరంగ్‌దళ్ ప్రశిక్షణ వర్గ
ఎల్లారెడ్డి: బజరంగ్‌దళ్ ప్రశిక్షణ వర్గను ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బజరంగ్‌దళ్ ప్రతినిధులు తెలిపా రు. కరీంనగర్‌లోని శ్రీసరస్వతి శిశు మందిర్‌లో వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమానికి వెళ్లే వారు ఎల్లారెడ్డి బజరంగ్‌దళ్ ప్రతినిధుజీలను సంప్రదించాలని సూచించారు.
కొనసాగుతున్న
బ్రహ్మోత్సవాలు
మాచారెడ్డి : చుక్కాపూర్‌లోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగు తున్నాయి. శనివారం ఉదయం సేవాకాలం శాంతిపాఠం నిర్వహించారు. అనంతరం ద్వారతోరణ పూజలు, మూలమంత్ర హవనం, ఉత్సవ మూర్తులకు పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కమలాకర్‌రెడ్డి, ఈవో శ్రీధర్‌రావ్, డైరెక్టర్లు లక్ష్మీరాజం, రాజిరెడ్డి, ఆంజనేయులు, బాల్‌రెడ్డి, ఆలయ సిబ్బంది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
దంచికొట్టిన వాన
బాల్కొండ: బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలో శనివారం రాత్రి అకాలవర్షం దంచి కొట్టింది. దీంతో కల్లాల్లో ఉన్న సజ్జలు, నువ్వులు, కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. సుమారు 40 నిమిషాలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
‘భూభారతి డెస్క్ వర్క్ నిర్వహించాలి’
‘భూభారతి డెస్క్ వర్క్ నిర్వహించాలి’


