● హరహర.. శివశంకర | - | Sakshi
Sakshi News home page

● హరహర.. శివశంకర

Nov 30 2026 12:17 AM | Updated on Nov 30 2026 12:17 AM

టీడీపీ వర్సెస్‌ బీజేపీ

గోకవరం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి నాయకుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఆ వివరాల ప్రకారం.. గోకవరంలో సర్పంచ్‌ స్థానానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి గాజింగం సత్తిబాబు సతీమణి వల్లీదేవిని బలపర్చగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాస్‌రావు జనసేన పార్టీ నాయకుడు పదిలం మురళీ సతీమణి కనకలక్ష్మిని బలపరిచారు. జనసేన, బీజేపీ మద్దతుదారులు రెండు వర్గాలుగా విడిపోయి, ప్రచార సమయం నుంచి ఒక వర్గంపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం సమీపంలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్దకు కంబాల శ్రీనివాస్‌రావు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమై తోపులాటకు దారితీసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పింపించారు. అనంతరం కంబాల శ్రీనివాస్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రం పరిశీలనకు వెళ్లిన తనపై, తన అనుచరుడిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారని ఆరోపించారు. అలాగే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గోకవరంలో కంబాల శ్రీనివాస్‌రావు కార్యాలయానికి చేరుకుని జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీర్రాజు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. కంబాల శ్రీనివాస్‌రావు, ఆయన అనుచరుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడులను బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు.

గుర్తులు మార్చేశారని

ఆందోళన

కొత్తపల్లి: అధికారులు కేటాయించిన గుర్తుతో ప్రచారం చేసుకుంటే.. తీరా పోలింగ్‌ కేంద్రం వద్ద అభ్యర్థులను తెలిపే నోటీసు బోర్డులో గుర్తులు మార్చేశారంటూ ఓ అభ్యర్థిని ఆందోళన చేశారు. కొత్తపల్లి ఎస్సీ పేటలోని ఎంపీపీ పాఠశాలలో 12వ వార్డుకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాన్ని నిర్వహించారు. ఈ పోలింగ్‌ కేంద్రం వద్ద ‘గౌను’ గుర్తు కేటాయించిన కుమ్మరి రత్నం పేరు పక్కన ప్రెషర్‌ కుక్కర్‌ గుర్తు రాయడమేమిటంటూ ఆందోళన చేశారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం సిబ్బందిని, బ్యాలెట్‌ బాక్స్‌లను తరలించకుండా ఆమె అడ్డుకున్నారు. రీ పోలింగ్‌ నిర్వహించాలని పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రం వద్దకు జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ చేరుకున్నారు. తామిద్దరం ప్రచారం చేసుకున్న గుర్తుల ప్రకారమే విజయాన్ని కేటాయించాలని ఆయా అభ్యర్థులు జేసీకి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా విజయాన్ని కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

వేమవరంలో సర్పంచ్‌, వార్డు అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా

కర్రలతో దాడులకు పాల్పడిన టీడీపీ రౌడీలు (ఫైల్‌)

అనపర్తిలో దాడులకు దిగుతున్న టీడీపీ గూండాలు (ఫైల్‌)

సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రం బాలాత్రిపుర సుందరీ సమేత కుమారామ భీమేశ్వరస్వామి ఆలయం కార్తిక మాసం మూడో ఆదివారం కావడంతో కిటకిటలాడింది. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారికి అభిషేక పూజలను ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టు బోర్డు చైర్మన్‌ కంటే జగదీష్‌ మోహనరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ప్రారంభించారు. అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. కాలభైరవ స్వామి ఆలయం, ధ్వజస్తంభం, రావిచెట్టు, జమ్మి చెట్టు, మారేడు చెట్టు, ఆలయ ప్రాంగణంలోని తులసి మొక్క వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. ఆలయానికి రూ.2,500 చెల్లించిన భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్షపత్రి పూజలు చేశారు. వారిచే రాత్రి ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగార్చన ఆకట్టుకుంది. ఆలయ పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, అళ్లకి రాజగోపాలశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఫ గోకవరంలో ఇరువర్గాల ఘర్షణ

ఫ ‘కంబాల’పై దాడి దారుణం:

ఎమ్మెల్సీ వీర్రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement