వైఎస్సార్‌ సీపీ తుని చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా రామతులసి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ తుని చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా రామతులసి

Oct 16 2026 12:06 AM | Updated on Oct 16 2026 12:06 AM

● తొలి జాబితాలో 23 మంది

కౌన్సిలర్‌ అభ్యర్థులు

● ప్రకటించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా

● పట్టణాన్ని రూ.300 కోట్లతో

అభివృద్ధి చేస్తామని వెల్లడి

తుని: వైఎస్సార్‌ సీపీ నుంచి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పిట్లకంచి రామతులసి పేరును ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రకటించారు. దీంతో పాటు మున్సిపాలిటీలోని 23 వార్డుల నుంచి కౌన్సిలర్లుగా పోటీ చేసే పార్టీ అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. ఎస్‌.అన్నవరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుని పట్టణాన్ని రూ.300 కోట్లతో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని చెప్పారు. పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బలమైన అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో యువతకు ప్రాధాన్యం కల్పించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ పాలనలో నిత్యావసర సరకుల ధరలు ఆకాశానికి చేరాయని గుర్తు చేశారు. ఆహార పదార్థాల కల్తీ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. పట్టణ పరిధిలోని సచివాలయాల్లో ఫుడ్‌ సేఫ్టీకి సంబంధించి ప్రత్యేక అధికారిని నియమిస్తామని చెప్పారు. పట్టణాభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి, టీడీపీ ఎమ్మెల్యే యనమల దివ్య సహకారం తీసుకుంటామని తెలిపారు. పట్టణానికి శాశ్వత డంపింగ్‌ యార్డుకు తుని మండలం హంసవరంలో రెండెకరాల భూమి సేకరించామని, ఇంతలో ఎన్నికలు రావడంతో అది కార్యరూపం దాల్చలేదన్నారు. పారిశుధ్యం, రోడ్లు, కాలువలు, తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు వరద నీటి నుంచి పట్టణాన్ని కాపాడేందుకు కరకట్ట నిర్మాణానికి కృషి చేస్తామని రాజా వెల్లడించారు. సమావేశంలో పార్టీ తుని పట్టణ అధ్యక్షుడు అన్నవరం శ్రీను, మున్సిపల్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి రేలంగి రమణా గౌడ్‌, నాయకులు పోతల రమణ, పిట్లకంచి కామేశ్వరరావు, కలిదిండి సత్యనారాయణరాజు పాల్గొన్నారు.

కౌన్సిలర్‌ అభ్యర్థులు వీరే..

వార్డు అభ్యర్థి కేటగిరీ

1 చిట్టిబోయిన మంగాదేవి బీసీ మహిళ

2 చింతల సునీత ఎస్సీ జనరల్‌

3 నందికోళ్ల దివ్యవాణి ఎస్సీ మహిళ

5 మర్రా రవికుమార్‌ ఎస్సీ జనరల్‌

7 పిట్ల లక్ష్మి బీసీ మహిళ

8 రేలంగి విజయదుర్గ జనరల్‌ మహిళ

9 అసనాల పద్దేష్‌ ఎస్టీ జనరల్‌

10 వడ్లమూరి అరుణ జనరల్‌ మహిళ

11 పిల్యాణం నూకరాజు బీసీ జనరల్‌

12 షేక్‌ నూరున్సీసా బీసీ మహిళ

13 రొంగల యేసు జనరల్‌

15 షేక్‌ సత్తార్‌ మున్నీసా బీసీ మహిళ

16 కనిగిరి వెంకట రమణ జనరల్‌

17 కన్నూరి శ్రీనివాసరావు బీసీ జనరల్‌

19 కొప్పర్తి రాజు జనరల్‌

22 కొండ ఉమ జనరల్‌ మహిళ

24 ఆర్సి ప్రవీణ్‌ నాగ చిన్నబాబు జనరల్‌

25 మార్నీడి వెంకట సూర్యామణి జనరల్‌ మహిళ

30 చింతమనేడి జోగారావు జనరల్‌

31 తేజోమూర్తుల ఉమాశంకర్‌ శర్మ జనరల్‌

32 అడిగర్ల రాజ్యలక్ష్మి జనరల్‌ మహిళ

33 నడింపల్లి సుమంత్‌ వర్మ జనరల్‌

35 రొంగల రాజేశ్వరి బీసీ మహిళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement