బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో నీట్ పీజీ పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించినట్టు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లాలో ఆదివారం జరిగిన నీట్ పీజీ పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సాఫ్ట్ టెక్నాలజీ, ఐయాన్ డిజిటల్ జోన్ పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరుగుతున్న తీరును, వసతుల కల్పన, విద్యార్థుల హాజరు ఇతర భద్రత ఏర్పాట్లను నేరుగా పరిశీలించి, అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ పరీక్ష ముగిసిందని ఆయన తెలిపారు. ఈ పరీక్షకు కాకినాడ జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో 1159 మందికి గాను 1147 మంది విద్యార్థులు హాజరయ్యారని, 98.95 శాతం హాజరు నమోదైందని కలెక్టర్ చెప్పారు.
కాపు విద్యార్థులకు
స్కాలర్‌షిప్‌ల పంపిణీ
అమలాపురం టౌన్: కోనసీమ కాపు ఉద్యోగ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు అందిస్తున్న ఆర్ధిక సాయం ప్రశంసనీయమని కాకినాడ జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి, జిల్లా వ్యవసాయ అధికారి మాధవవరపు వెంకట రామారావు అన్నారు. కోనసీమ కాపు ఉద్యోగ సేవ సమితి ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన కాపు విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం అమలాపురం చెన్నమల్లేశ్వర కళాపరిషత్ వేదిక వద్ద అదివారం నిర్వహించారు. కోనసీమ కాపు ఉద్యోగ సేవా సమితి అధ్యక్షుడు నల్లా రామకష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 120 మంది కాపు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున రూ.6 లక్షలు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మెట్ల రమణబాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్, రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టర్ దేశంశెట్టి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అందజేశారు.


