భూమి తక్కువగా చూపుతోంది
మా గ్రామంలో నాకు ఎప్పటి నుంచో ఎకరం పొలం ఉంది. ఆన్‌లైన్‌లో 0.681 సెంట్లు మాత్రమే నమోదయ్యింది. మిగిలిన 319 సెంట్లు నమోదు కాలేదు. స్థానిక మండల కార్యాలయం చాలా సార్లు ఫిర్యాదు చేశాను. పనులు కావడం లేదని కాకినాడ వచ్చి ఫిర్యాదు చేసినా ఏడాది నుంచి సమస్య పరిష్కరించడం లేదు.
–డి.బాలమ్మ, ఆనూరు, పెద్దాపురం మండలం
నష్ట పరిహారం ఇవ్వడం లేదు
నాకు మా గ్రామంలో కొంత వ్యవసాయ భూమి ఉంది. నా భూమి పక్క నుంచే రహదారి నిర్మించారు. దీంతో 206 గజాల స్థలం రోడ్డులో పోయింది. తీసుకొన్న భూమికి నష్ట పరిహారం ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లినా పట్టించుకోవడం లేదు. కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సి వస్తోంది.
– పీఎస్ అబ్రహం,
తిమ్మాపురం, కాకినాడ రూరల్ మండలం.
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పదే పదే తిరుగుతున్నాం.. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నాం.. అయినా స్పందించకపోవడంతో విసిగిపోతున్నాం.. అంటూ పీజీఆర్‌ఎస్‌కు వస్తున్న అర్జీదారులు వాపోతున్నారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్నా, ప్రయోజనం మాత్రం శూన్యమేనని పలువురు అంటున్నారు. చిన్న సమస్యలకూ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని చెబుతున్నారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 352 అర్జీలు వచ్చాయి.
నడవలేనని చెబుతున్నా..
కనీసం నడవలేని స్థితిలో ఉన్నాను. ఎక్కడికై నా వెళితే వీర్‌చైర్ ఉండాలి. ప్రస్తుతం నాకు రూ. 6 వేల వికలాంగ పింఛన్ వస్తుంది. రూ. 15 వేల పింఛన్ కోసం స్థానికంగా అర్జీ ఇచ్చినా పట్టించుకోలేదు. ఐదేళ్ల వయసు నుంచి నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా. ప్రస్తుతం నాకు 21 ఏళ్లు. ఎన్నో ఇబ్బందులు పడి కలెక్టరేట్‌కు వచ్చినా ఎవరూ స్పందించడం లేదు. నా తండ్రి వీరవెంకట సత్యనారాయణతో కలసి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు.
– బి.సుధీర్ మహేష్, కొంతంగి, శంఖవరం మండలం
తిరగని కార్యాలయం లేదు
తల్లిదండ్రులతో కలిసి ఉన్న రేషన్ కార్డు కారణంగా నాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదు. నాకు పెళ్లయ్యి ఏడేళ్లు గడుస్తున్నా, ప్రత్యేకంగా రేషన్ కార్డు మంజూరు చేయడం లేదు. రేషన్‌కార్డు కోసం నేను తిరగని కార్యాలయం లేదు. ప్రస్తుతం మా పిల్లలకు తల్లికి వందనం రావడం లేదు. ఎందుకంటే మీకు ప్రత్యేకంగా రేషన్ కార్డు ఉండాలంటున్నారు.
–దేవర మహేష్‌బాబు, కాకినాడ
ఫ పదేపదే తిరుగుతున్నా పట్టించుకోరా?
ఫ పీజీఆర్‌ఎస్ సమస్యలు
పరిష్కారం కాక ఆవేదన


