కాకినాడ రూరల్: స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ)లో జబల్‌పూర్ కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై 15 రోజులుగా నిర్వహించిన శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎస్‌ఐఎఫ్‌టీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అంజలి మాట్లాడుతూ మత్స్య రంగానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఆచరణాత్మక అవగాహన పెంపొందించేందుకు శిక్షణ దోహద పడుతుందన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు కాకినాడ ఫిషింగ్ హార్బర్, కుంభాభిషేకం ఫిష్ ల్యాండింగ్ పాయింట్, డ్రై ఫిష్ మార్కెట్, ఉప్పాడ రొయ్యల హేచరీస్, కడియం, బలభద్రపురంలలో చేపల హేచరీలపై అవగాహన కల్పించామన్నారు,. మడ అడవులు, గోదావరి నదీ ముఖద్వారం, యానాం చొల్లంగి పేటలో స్మోకింగ్ యూనిట్లు తదితర వాటిపై అవగాహనతో పాటు సముద్ర ప్రయాణం ద్వారా మత్స్య సంపద సేకరణపై అవగాహన కల్పించామన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో జబల్‌పూర్ కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ అధ్యాపకులు ప్రతిక్ కుమార్ తివారీ, ఏడీఎఫ్ కిరణ్‌కుమార్, ఎఫ్‌డీఓ దత్తాత్రేయ, తదితరులు పాల్గొన్నారు.


