పవన్‌ ఇలాకా.. ముంపు తాలూకా | - | Sakshi
Sakshi News home page

పవన్‌ ఇలాకా.. ముంపు తాలూకా

Jun 28 2026 12:16 AM | Updated on Jun 28 2026 12:16 AM

ఫ చిన్న వర్షానికే పిఠాపురం జలమయం

ఫ రోడ్లపైకి చేరిన నీరు

పిఠాపురం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం పట్టణంలో ప్రజల కష్టాలు తీరడం లేదు. రూ.కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం అంటున్న నేతలు.. ప్రజల కష్టాలను చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారు. శనివారం ఉదయం కురిసిన చిన్నపాటి వర్షానికి పిఠాపురంలోని 3వ వార్డు ముంపు బారిన పడింది. డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో వర్షం నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఆర్టీసీ కాంప్లెక్స్‌, కాంప్లెక్స్‌ బ్యాక్‌ సైడ్‌, వన్‌ వే ట్రాఫిక్‌ రోడ్‌, భాష్యం స్కూల్‌ రోడ్డు పరిస్థితి దారుణంగా మారింది. పిఠాపురం బస్టాండ్‌ నుంచి స్కూల్‌కు వెళ్లే పిల్లలు మోకాలు లోతు నీటిలో వెళ్లడం బాధాకరమని 2, 3, 4 వార్డుల సమస్యల పరిష్కార పోరాట కమిటీ కన్వీనర్‌ కరణం విశ్వనాథం అన్నారు. ఈ రెండున్నరేళ్లలో అనేకసార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు ఇచ్చిన ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement