ప్రతి పంటకూ మద్దతు ధర | - | Sakshi
Sakshi News home page

ప్రతి పంటకూ మద్దతు ధర

Jun 27 2026 12:13 AM | Updated on Jun 27 2026 12:13 AM

60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకూ

రూ.10 వేల పెన్షన్‌

కౌలుదారులకు

చట్టబద్ధమైన రక్షణ

ఏపీ రైతు సంఘం నేత

సూర్యనారాయణ డిమాండ్‌

పిఠాపురం: స్వామినాథన్‌ కమిటీ సిఫార సు చేసిన విధంగా ప్రతి పంట ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం లాభం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. సంఘం జిల్లా రెండో మహాసభ లు పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో శుక్రవారం జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యనారా యణ మాట్లాడుతూ, 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకూ రూ.10 వేల పెన్షన్‌ ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని, విద్యుత్‌ ప్రైవేటీకరణను ఆపాలని, కౌలు రైతులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల సాధనకు కార్యాచరణ రూపొందించే దిశ గా వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో ఏలూరులో సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ విధానాలు రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని సూర్యనారాయణ అన్నారు. ఇటీవల జరిగిన ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్లలో అమెరికా, ఇంగ్లండ్‌, యూరోపియన్‌ దేశాల నుంచి జీరో ట్యాక్స్‌తో వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఈ ఒప్పందంతో ధరలు మరింత పడిపోయి రైతులు దారుణంగా దెబ్బ తింటారని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధర అందే పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు.

సబ్సిడీకి కత్తెర వేసేందుకే ఎరువుల యాప్‌

రైతులకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించుకునేందుకే ఎరువుల పంపిణీకి ప్రభుత్వా లు యాప్‌ తీసుకొచ్చాయని సూర్యనారాయణ అన్నారు. దీని ద్వారా ఎకరానికి మూడు విడతలుగా రెండు బస్తా లు మాత్రమే ఇస్తామంటున్నారన్నారు. గోదావరి జిల్లాల్లో మొక్కజొన్నకు ఎకరానికి 10 నుంచి 12 బస్తాల ఎరువులు వేస్తున్నారని, ప్రభుత్వం రెండు బస్తాలు మాత్రమే ఇస్తే, మిగిలింది రైతులు సొంత డబ్బుతో కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పారు. సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, నాయకుడు నీలపాల సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement