బంగారంపై యుద్ధ సంక్షోభం | - | Sakshi
Sakshi News home page

బంగారంపై యుద్ధ సంక్షోభం

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం బంగారంపై పడింది. గడచిన మూడు వారాలుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ధరలు తగ్గిన ప్రతి సందర్భంలోనూ ప్రజలు భయపడి కొనుగోళ్లు ఆపేస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ధరలు ముందుముందు ఇంకా తగ్గుతాయనే భయంతో కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితి మరో నెల రోజులుంటుందని అంచనా వేస్తున్నాం.

– అనిల్‌ కుమార్‌ జైన్‌, రాష్ట్ర బులియన్‌ అసోసియేషన్‌ కోశాధికారి, అమలాపురం

అప్పటి వరకూ ఆగాల్సిందే..

బంగారం కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. ధర తగ్గిందని అనుకుంటే బంగారం కొనేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. ఒకప్పుడు రోజుకు పది పదిహేను మంది బంగారం కొనుగోలుకు వచ్చేవారు. ఇప్పుడు నలుగురైదుగురికి మించి రావడం లేదు. శ్రావణ మాసం వచ్చే వరకూ మార్కెట్లో ఈ అనిశ్చితి ఉండేలా కనిపిస్తోంది.

– కొండేపూడి శివరామకృష్ణ,

గోల్డ్‌ మర్చంట్‌, కరప

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement