ఒకరికి ఏకంగా రూ.12 వేల కటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఒకరికి ఏకంగా రూ.12 వేల కటింగ్‌

Jun 25 2026 12:12 AM | Updated on Jun 25 2026 12:12 AM

అన్నవరం: పులికి లేడి లాంటి చిన్న జంతువులే లోకువ.. అది సాధారణంగా ఏనుగుల్లాంటి పెద్ద జంతువుల జోలికి వెళ్లదు. అది ఆటవిక న్యాయం. నాగరిక సమాజంలో కూడా పెద్ద ఉద్యోగుల జోలికి సాధారణంగా ఎవరూ వెళ్లరు. చిరుద్యోగులే ఎప్పుడు టార్గెట్‌ అవుతూంటారు. అన్నవరం దేవస్థానంలో సరిగ్గా ఇలాగే జరిగింది.

దేవస్థానంలో రెగ్యులర్‌ ఉద్యోగులు సుమారు 215 మంది ఉన్నారు. వీరికి జీతభత్యాలు ఒక్కొక్కరికి నెలకు సుమారు రూ.లక్ష వరకూ ఉంటుంది. కాగా, దేవస్థానంలో ఎన్‌ఎంఆర్‌, అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, సెక్యూరిటీ, శానిటేషన్‌, స్వామివారి పల్లకీ బోయీలు, ఆలయాల్లో వైదికపరమైన పనులు చేసే పరిచారకులు సుమారు వెయ్యి మంది ఉంటారు. వీరి జీతాలు నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ ఉంటాయి. వీరు రోజూ బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వేయాలనే నిబంధన ఉంది. వీరిలో చాలా మంది సంబంధిత సెక్షన్‌ సూపరింటెండెంట్ల అనుమతితో వ్యక్తిగత కారణాల వలన తమ విధులను వేరొకరికి అప్పగించి, తరువాత వారి విధులను వీరు చేస్తూంటారు. తద్వారా పనులు, సేవల్లో లోటు లేకుండా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కోసారి బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సందర్భాల్లో ఆ సూపరింటెండెంట్లు అటెండెన్స్‌ రిజిస్టర్‌లో విధులకు హాజరైనట్టు ‘పి’ అని నమోదు చేస్తారు.

సూపరింటెండెంట్లు ఆవిధంగా నమోదు చేసినప్పటికీ సత్యదేవుని సన్నిధిలో పని చేస్తున్న 83 మంది చిరుద్యోగులకు మే నెల జీతాల్లో ఒకటి, రెండు రోజుల చొప్పున కోత విధించడం వివాదాస్పదమైంది. బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వేయకపోవడంతో గైర్హాజరైనట్లు భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈవిధంగా ఒక్కొక్కరి జీతాల్లో రూ.600, రూ.వెయ్యి చొప్పున కటింగ్‌ చేశారు. కట్‌ చేసిన మొత్తం రూ.3.5 లక్షలు దేవస్థానానికి జమ చేశారు. దీనిపై ఈఓ వద్ద పలువురు సూపరింటెండెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా కట్‌ చేయాల్సిందేనని ఆదేశాలు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ ఉద్యోగులకు వచ్చే నెల జీతమే తక్కువ. అందులోనూ కోత పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పల్లకీ మోసినా తప్పని జీతం కోత

దేవస్థానంలో 26 మంది పల్లకీ బోయీలకు ప్రస్తుతం 20 మంది పని చేస్తున్నారు. వీరందరూ రజకులే. శతాబ్దాల నుంచి నాలుగు ఇంటి పేర్ల వారే స్వామివారి పల్లకీ సేవలో పాల్గొంటారు. వీరు లేనిదే దేవుని సేవ జరగదు. వీరికి ఒక్కొక్కరికి అన్ని కటింగ్‌లూ పోనూ చేతికి రూ.18 వేల జీతం వస్తోంది. గత ఏప్రిల్‌ 26 నుంచి మే రెండో తేదీ వరకూ జరిగిన సత్యదేవుని వార్షిక కల్యాణోత్సవాల్లో ఈ బోయీలంతా పని చేశారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ జరిగిన వివిధ ఉత్సవాల్లో స్వామి, అమ్మవారిని వీరు ఆయా వాహనాల్లో ఊరేగించారు. ఇవి కాకుండా స్వామివారికి ప్రతి రోజూ ఏదో ఒక సేవ ఉండనే ఉంది. ఈ క్రమంలో ఆరుగురు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ సరిగా వేయలేదు. ఈ కారణంతో తమకు రూ.600 నుంచి రూ.3 వేల వరకూ జీతం కట్‌ చేశారని వారు వాపోయారు.

ఈఓ లేనప్పుడు అందరూ పని చేస్తున్నారా?

వాడపల్లి దేవస్థానం ఈఓగా ఉన్న నల్లం సూర్యచక్రధరరావు అన్నవరం దేవస్థానానికి ఇన్‌చార్జి ఈఓగా ఉన్నారు. ఆయన వారానికి మూడు నాలుగు రోజులు ఇక్కడ, మిగిలిన రోజుల్లో వాడపల్లిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఇక్కడ లేనప్పుడు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వేసి, ఏ ఉద్యోగి ఎక్కడకు వెళ్తున్నారో ఎలా తెలుస్తుందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

·˘ ºÄñæ*-Ððl$-{sìæMŠS Asñæ…-yðl¯ŒSÞ

వేయలేదని 83 మందికి జీతం కట్‌

·˘ JMöPMýSP-Ç i™èl… ¯ðlÌSMýS$

రూ.12 వేల నుంచి రూ.18 వేలు

·˘ A…§ýl$ÌZ¯ól Æý‡*.600 ¯]l$…_

రూ.1,000 వరకూ కోత

·˘ çÜ™èlÅ-§ólÐ]l#° çܰ²-«¨ÌZ

అధికారుల తీరుపై విమర్శలు

పల్లకీ బోయీల్లో ఎవరైనా వృద్ధులైతే తమ కొడుకులు, అల్లుళ్లను ఈ పనిలో పెట్టుకుంటూంటారు. అలాగే, మైలు, ఇతర కారణాలతో ఎవరైనా విధులకు రాలేని పరిస్థితి ఏర్పడితే మరొకరిని ఆ సేవకు పంపిస్తారు. ఇదే విధంగా వృద్ధుడైన ఒక బోయీ తను రాలేని పరిస్థితిలో వేరొకరిని సేవకు పంపించాడు. అతడు రోజూ పల్లకీ సేవ చేశాడు. కానీ, బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వేయలేదనే కారణంతో ఆ వృద్ధ బోయీ జీతం నుంచి ఏకంగా రూ.12 వేలు కట్‌ చేసి, రూ.6 వేల జీతం మాత్రమే ఇచ్చారు. తనకు బదులు పని చేసిన వారికి అందులో నుంచి ఎంత మొత్తం ఇవ్వాలో తెలియక ఆ వృద్ధుడు ఇబ్బంది పడుతున్నాడు. జీతంలో కోత పడిన 83 మంది చిరుద్యోగుల పరిస్థితి ఇదేవిధంగా ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement