నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ): అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరంలో ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం పిలుపు మేరకు కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో) వీవీ సతీష్ కుమార్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు పట్టుదల, కష్టపడే తత్వాన్ని అలవర్చుకుని, భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
జేఎన్‌న్‌టీయూకే వరకు పరుగు
జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్‌ఏ) మైదానం నుంచి ప్రారంభమైన ఈ రన్ స్థానిక జేఎన్‌టీయూకే వరకు సాగి, తిరిగి స్పోర్ట్స్ అథారిటీ మైదానానికి చేరుకుంది. కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ, రన్ కన్వీనర్ వి.రవి రాజు నేతృత్వంలో ఈ పరుగును పక్కా ప్రణాళికతో నిర్వహించారు. రన్ ముగిసిన వెంటనే పాల్గొన్న క్రీడాకారులందరికీ దివంగత డాక్టర్ పి.చిరంజీవిని జ్ఞాపకార్థం ప్రత్యేక ప్రశంసాపత్రాలను (సర్టిఫికెట్లు) అందజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు అర్జునరావు, పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వర్మ, జిల్లా వ్యాయామ సంఘం అధ్యక్షుడు పి.శ్రీనివాస్, కార్యదర్శి వి.మాచరిరావు, కోశాధికారి నాగలింగేశ్వరరావు, ఖోఖో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కె.పట్టాభిరామం, శ్రీనివాస్ కుమార్, వెటరన్ అథ్లెట్ కాంతారావు, ఫిజికల్ డైరెక్టర్లు కేఎల్ నాగమణి, రాజు మంగ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
ఫ జేఎన్‌టీయూకే వరకు
ఉత్సాహంగా సాగిన పరుగు
ఫ విజేతలకు సర్టిఫికెట్ల ప్రదానం


