ఎన్నిసార్లు తిరిగినా నిరాశే.. | - | Sakshi
Sakshi News home page

ఎన్నిసార్లు తిరిగినా నిరాశే..

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడసిటీ): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో వ్యయప్రయాసలకోర్చి వస్తున్న అర్జీదారులకు నిరాశే ఎదురవుతోంది. మండల కేంద్రాల్లో సమస్య పరిష్కారం కాక జిల్లా కేంద్రమైన కాకినాడకు వచ్చి అర్జీదారులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ వాటికి ఏ విధమైన పరిష్కారం లభించడం లేదు. ఇచ్చిన అర్జీకి పరిష్కారం లభించకపోగా పరిష్కారం అయినట్లు మాత్రమే మొబైల్‌ ఫోన్‌లకు ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయని అర్జీదారులు మండిపడుతున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 321 ప్రజలు అర్జీలు సమర్పించారు.

ఫ పరిష్కారం కానీ సమస్యలు

ఫ అర్జీదారులు తప్పని అవస్థలు

ఫ పీజీఆర్‌ఎస్‌ నిర్వహణపై పెదవి విరుపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement