కాకినాడ రూరల్: సంస్కృతీ సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు జమ్మలమడక నాగమణి అన్నారు. ఒకవైపు సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ డాంబికా లు పలుకుతున్నారని.. మరోవైపు ప్రజలకు ఆహాదాన్ని పంచే బీచ్‌లలో బీచ్ షాక్స్ పేరిట మద్యం అమ్మకాలకు తెర తీస్తున్నారని విమర్శించారు. కాకినాడలో ఆమె శనివారం మాట్లాడుతూ, రా ష్ట్రంలోని ఎనిమిది బీచ్‌లలో మద్యం అమ్మకాల కోసం చంద్రబాబు సర్కార్ ప్రత్యేక జీఓ విడుదల చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆదా యం కోసం ఇంతలా దిగజారిపోవాలా అని నిలదీశారు. పైలట్ ప్రాజెక్టుగా సూర్యలంక, విశాఖ రుషికొండ, కాకినాడ బీచ్‌లలో మద్యం విక్రయాలకు తలుపులు బార్లా తెరుస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతూండటంతో ప్రధానంగా యువత పెడదో వ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యా లు పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పచ్చ పార్టీలోని ప్రతి ఒక్కరూ బా ధ్యత వహించాలన్నారు. పిల్లాపాపలతో ఉల్లా సంగా గడిపేందుకు ప్రజలు వచ్చే బీచ్‌లలో మ ద్యం పారించి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మా ర్చాలనుకుంటున్నారా అని చంద్రబాబును నిలదీశారు. గతంలో ఆయన సీఎంగా ఉండగా విశా ఖ బీచ్‌లో బికినీ పండగ చేయాలనుకున్నారని గుర్తు చేశారు. గోవా, ముంబై మాదిరిగా ఇక్కడి బీచ్‌లలో కూడా మద్యం అమ్మాలనుకోవడం సిగ్గుచేటన్నారు. పెట్టుబడులు ఆకర్షించే పేరుతో చంద్రబాబు, లోకేష్‌లు సింగపూర్, బ్యాంకాక్, హాంకాంగ్ వంటి దేశాలకు వెళ్లి వస్తూ అక్కడి దు ష్ట సంప్రదాయాలను ఇక్కడకు తీసుకురావాలను కోవడం అవివేకమని మండిపడ్డారు. ఒక మహి ళగా, ఒక తల్లిగా బీచ్‌లలో మద్యం విక్రయించాల నే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని స్ప ష్టం చేశారు. చంద్రబాబుకు మహిళలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీచ్‌లను బార్లుగా మార్చే జీఓను వెనక్కు తీసుకోవాలని నాగమణి డిమాండ్ చేశారు.


