తొలి తిరుపతిలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

తొలి తిరుపతిలో భక్తుల రద్దీ

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

సామర్లకోట: పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవీ సమేత శృంగార వల్లభ స్వామి ఆలయానికి ఽశనివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు కాలి నడకన సైతం వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో, ఆల యం రద్దీగా మారింది. తెల్లవారుజామున స్వామి వారికి ఇచ్చిన తొలి హారతిని తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. సుమారు 18 వేల మంది భక్తులు స్వామి వారి దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,62,680, అన్నదాన విరాళాలు రూ.63,525, కేశ ఖండన ద్వారా రూ.6,080, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.20,460, ఇతరత్రా కలిపి దేవస్థానానికి రూ.2,53,495 ఆదాయం సమకూరిందని వివరించారు. స్వామివారి అన్నప్రసాదాన్ని 3,500 మంది భక్తులు స్వీకరించారని తెలిపారు. స్వామివారిని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మకాయల రంగనాగ్‌ దర్శించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న గోపురం అభివృద్ధి పనులను పరిశీలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement