ఎమ్మెల్యే కొడుకు లే అవుట్
వృద్ధాశ్రమం పేరుతో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుమారుడు వేసిన 30 ఎకరాల లే అవుట్‌కు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. జగనన్న లే అవుట్‌ను కబ్జా చేసి, పేదలను బలవంతంగా వెళ్లగొట్టి రూ.కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వృద్ధాశ్రమం నిర్మాణాన్ని నాతో సహా అందరం స్వాగతిస్తున్నాం. అవసరమైతే తోడ్పాటు కూడా అందిస్తాం. జి.రాగంపేటకు చెందిన 200 మందికి పైగా పేదలున్న జగనన్న కాలనీలో కనీస సదుపాయాలు కల్పించలేని ఎమ్మెల్యే చినరాజప్ప.. వృద్ధాశ్రమం నిర్మాణం పేరుతో సుమారు రూ.20 లక్షల ప్రభుత్వ నిధులతో 40 అడుగుల సీసీ రోడ్డు నిర్మించడంలో ఆంతర్యమేమిటో సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే కుమారుడి లే అవుట్ కోసమే ఈ రోడ్డు వేశారు. చంద్రబాబు మాదిరిగానే సంపద సృష్టిస్తామంటూ ఎమ్మెల్యే దోచుకు తింటున్నారు. వృద్ధాశ్రమంతో ఇళ్ల స్థలాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపించాలి. న్యాయం కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.
– దవులూరి దొరబాబు,
వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పెద్దాపురం


