వృద్ధాశ్రమం ముసుగులో.. | - | Sakshi
Sakshi News home page

వృద్ధాశ్రమం ముసుగులో..

Jun 20 2026 10:44 AM | Updated on Jun 20 2026 10:44 AM

ఇందులో భాగంగా జి.రాగంపేట జగనన్న కాలనీలో ఖాళీగా ఉన్న స్థలాలపై అధికార పార్టీ నేతలు కన్ను వేశారు. ఇక్కడ రెండో విడతలో ఇళ్లు నిర్మించుకోవాల్సిన లబ్ధిదారులను అధికారం అండతో నయానో భయానో దారికి తెచ్చుకుని ఉన్న ఫళంగా ఖాళీ చేయించారు. సమాజ సేవ ముసుగులో జిల్లాలోని పలువురు ప్రముఖుల నుంచి భారీగా సేకరించిన విరాళాలతో అక్కడ వృద్ధాశ్రమం నిర్మాణం చేపట్టారు. ఈ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దీనికి ఆనుకుని ఉపాధి హామీ పథకంలో కొత్తగా 40 అడుగుల సీసీ రోడ్డు కూడా వేశారు. ప్రజలు, సమాజ సేవపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాదాపు మూడేళ్లుగా 160 కుటుంబాలు నివాసం ఉంటున్న జగనన్న కాలనీలో రోడ్లు, డ్రైన్ల వంటి కనీస వసతులు కల్పిస్తే బాగుండేదని, అటువంటిది ఇంకా ప్రారంభం కూడా కాని వృద్ధాశ్రమానికి 40 అడుగుల రోడ్డు వేయడంలో ఔచిత్యమేమిటని పలువురు ప్రశ్ని స్తున్నారు. వృద్ధాశ్రమ నిర్మాణాన్ని ఏ ఒక్కరూ తప్పు పట్టడం లేదు. కానీ, నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఖాళీ చేయించడం, అంతగా ప్రజోపయోగం లేనిచోట ప్రభుత్వ నిధులతో 40 అడుగుల రోడ్డు నిర్మించడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డును చూపించి ఇప్పుడు 30 ఎకరాలు, భవిష్యత్‌లో 150 ఎకరాలకు వేసే లే అవుట్‌కు లైన్‌ క్లియర్‌ చేసుకోవాలనేదే ఈ సేవ వెనుక ఉన్న మాస్టర్‌ ప్లాన్‌ అని ఆరోపిస్తున్నారు. ఇదంతా రియల్టర్లు, అధికార పార్టీ నేతల మధ్య కుదిరిన వందల కోట్ల రూపాయల రహస్య ఒప్పందంలో భాగమే తప్ప మరొకటి కాదని అంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement