వెంకన్న హుండీ ఆదాయం రూ.2.44 కోట్లు | - | Sakshi
Sakshi News home page

వెంకన్న హుండీ ఆదాయం రూ.2.44 కోట్లు

Jun 19 2026 12:30 AM | Updated on Jun 19 2026 12:30 AM

ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 34 రోజులకు రూ.2.44 కోట్ల ఆదాయం లభించిందని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరావు తెలిపారు. దేవదాయ శాఖ పర్యవేక్షణాధికారులు సహాయ కమిషనర్‌, మందేశ్వర స్వామి ఆలయ ఈఓ దారపు రెడ్డి సురేష్‌బాబు, దేవదాయ శాఖ రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్‌టీపీటీ శ్రీనివాస్‌, గ్రూపు దేవాలయాల ఈఓలు, ఆత్రేయపురం బి.నరేంద్ర, వెలిచేరు ఎం.సత్యనారాయణల సమక్షంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించామని పేర్కొన్నారు. ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామి ఆలయ హుండీలతో కలిపి రూ.1.77 కోట్లు, అన్నప్రసాద హుండీల ద్వారా రూ.66.55 లక్షల ఆదాయం లభించిందని వివరించారు. అలాగే, 52 గ్రాముల బంగారం, 1.588 కిలోల వెండి, 18 దేశాలకు చెందిన 77 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement