ఈ యాప్‌ వద్దు | - | Sakshi
Sakshi News home page

ఈ యాప్‌ వద్దు

Jun 19 2026 12:30 AM | Updated on Jun 19 2026 12:30 AM

గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీవీ నరసింహరావు ఉన్న సమయంలో యూరియా లేదు. రైతుల పరిస్థితి అప్పటి కంటే ఇప్పుడు మరింత అధ్వానంగా ఉంది. ఒకవైపు ప్రకృతి ఇబ్బందులకు గురి చేస్తూంటే.. వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టేలా యాప్‌ ప్రవేశపెట్టడం సరికాదు. చదువుకోని రైతులకు యాప్‌ ఏవిధంగా అర్థమవుతుంది? ఈ యాప్‌ వద్దు. ప్రభుత్వం మొండిగా దీనిని కొనసాగిస్తే ఎరువుల కొనుగోలు బంద్‌ చేసి, క్రాప్‌ హాలిడే ప్రకటిస్తాం. మద్దతు ధర మొక్కుబడిగా పెంచి, ఎరువుల ధరలను విపరీతంగా పెంచుతున్నారు.

– పైణ్ని చిట్టియ్య, రైతు, సామర్లకోట

ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం

ఏ విషయంలోనూ రైతుల నుంచి ఇంత వ్యతిరేకత రాలేదు. ఈ యాప్‌ను రైతులు వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. యాప్‌పై అవగాహన పెంచుకుంటే మేలు జరుగుతుంది. రైతులు కోరుకుంటే సిబ్బందిని సొసైటీ వద్ద ఉంచి యాప్‌పై అవగాహన కల్పిస్తాం. ఇతర రాష్ట్రాల్లో ఉండే రైతుల ఓటీపీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. స్మార్ట్‌ఫోన్‌ లేకపోయినా ఇబ్బంది లేదు.

– వి.మురళీధర్‌, వ్యవసాయాధికారి,

సామర్లకోట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement