ఇప్పటికీ రూపాయి రాలేదు | - | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ రూపాయి రాలేదు

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

నా పేరు నాగిరెడ్డి శివన్నారాయణ. మాది సంపర గ్రామం. ఐదు ఎకరాల సాగు చేశాను. నెలరోజుల క్రితం 250 బస్తాలు షావుకారికి విక్రయించాను. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆయనను డబ్బులు అడుగుతుంటే సీఎంఆర్‌ డబ్బులు పడినప్పుడు ఇస్తామంటున్నారు. నెలరోజులైనా డబ్బులు రాక ఖరీఫ్‌ పనుల ప్రారంభానికి ఇబ్బందులు పడుతున్నాను.

సీఎంఆర్‌ పడితే ఇస్తారుట

నా పేరు అద్దంకి సీతారామయ్య. 400 బస్తాల ధాన్యం విక్రయించాను. అప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ధాన్యం విక్రయించి నెల రోజులైంది. సీఎంఆర్‌ నగదు ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇస్తామని షావుకారు చెప్తున్నారు. ప్రస్తుతం నా దగ్గర సొమ్ము లేకపోవడంతో ఖరీఫ్‌ పనులు చేయలేకపోతున్నాను.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement