ఘనంగా సత్యదేవుని రథసేవ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సత్యదేవుని రథసేవ

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

అన్నవరం: రత్నగిరిపై ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆదివారం ఘనంగా ఊరేగించారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథంపై వేంచేయించారు. అనంతరం, అర్చకులు పూజలు చేసి రథసేవ ప్రారంభించారు. రథం లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల ఘోష నడుమ స్వామి, అమ్మవార్లను రథంపై ఆలయ ప్రాకారంలో మూడుసార్లు ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారిని తిరిగి ఆలయానికి చేర్చారు. ఆలయ ఏఈఓ భాస్కర్‌, భక్తులు రథసేవలో పాల్గొన్నారు.

నేడు ప్రత్యంగిర హోమం

అధిక జ్యేష్ట మాస అమావాస్య సందర్భంగా రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి సోమవారం ఉదయం 9 గంటలకు ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.1,116 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చు.

మందకొడిగా

పొగాకు కొనుగోళ్లు

దేవరపల్లి: రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని టొబాకో బోర్డు రీజినల్‌ మేనేజర్‌ జె.సురేంద్ర కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కిలో పొగాకుకు గరిష్టంగా రూ.265, కనిష్టంగా రూ.179, సగటున రూ.255.98 చొప్పున ధర పలుకుతోందని వివరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 33.01 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయని తెలిపారు. లో గ్రేడ్‌ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ఆసక్తి చూపడం లేదన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement