కాకినాడ లీగల్: తాళ్ళరేవు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు డి.శిరీషను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సీహెచ్ జానకీదేవి సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై డీఐజీ జానకీదేవి మాట్లాడుతూ సీనియర్ అసిస్టెంట్ శిరీష సమయానికి విధులకు హాజరు కాకపోవడంతో క్రయవిక్రయదారులు ఇబ్బంది పడుతున్నామని కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ దార్వా ఫిర్యాదులు చేశారని చెప్పారు. ఆమైపె అనేక ఫిర్యాదులు కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కె.ప్రసాదరావుకు రాగా ఆయన వెళ్లి పరిశీలించారని అన్నారు.బుధవారం తాళ్ళరేవు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిశీలించగా ఏపీఎఫ్‌ఆర్‌ఎస్‌లో సుమారు 4నెలల నుంచి లాగిన్ అవ్వలేనట్టు గుర్తించానని డీఐజీ తెలిపారు. గతంలో పిఠాపురం సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించినప్పడు ఏసీబీ తనిఖీల్లో ఆమైపె కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 30వ తేదీన క్రమశిక్షణ చర్యలకు తీసుకోవాలని ప్రభుత్వం అదేశించారు.


