జనసేన నాయకులపై ఎమ్మెల్సీ నాగబాబు అసహనం | - | Sakshi
Sakshi News home page

జనసేన నాయకులపై ఎమ్మెల్సీ నాగబాబు అసహనం

Apr 24 2026 7:20 AM | Updated on Apr 24 2026 7:20 AM

కాపు కార్పొరేషన్‌, కల్యాణ మండపం కోసం ప్రశ్నించిన జనసేన నాయకుడు

పవన్‌కల్యాణ్‌ ఆరోగ్యం కోసం

ఎవరూ అడగలేదని అసహనం

పిఠాపురం రూరల్‌: జనసేన నాయకులపై ఎమ్మెల్సీ నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. పిఠాపురం పర్యటనలో భాగంగా వచ్చిన ఎమ్మెల్సీ కె.నాగబాబు మండలంలోని కుమారపురంలో ఒక ప్రైవేట్‌ హోటల్‌లో గురువారం జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాపు కార్పొరేషన్‌, కల్యాణ మండపం కోసం ఒక జనసేన నాయకుడు ప్రశ్న వేశారు. అది విన్న నాగబాబు పవన్‌కల్యాణ్‌ ఆరోగ్యం కోసం ఎవరూ అడగలేదని జనసేన నాయకులపై అసహనం వ్యక్తం చేశారు. సెన్స్‌ ఉందా? అంటూ నిలదీశారు. ఎంత కష్టపడ్డారో, ఆయన ఆరోగ్యందెబ్బతిందని, అది ఎవరూ అడగటం లేదని మండిపడ్డారు. సదరు జనసేన నాయకుడు ‘సారీ సార్‌..’ అనడంతో ‘అది.. అదే కావాలి’ అంటూ శాంతించారు.

Advertisement
 
Advertisement
Advertisement