పెట్రోలు పోసి, నిప్పు పెట్టాలని చూసి.. | - | Sakshi
Sakshi News home page

పెట్రోలు పోసి, నిప్పు పెట్టాలని చూసి..

Apr 24 2026 7:20 AM | Updated on Apr 24 2026 7:20 AM

ప్రేమించడం లేదని యువతిపై

యువకుడి దాడి

సకాలంలో ఇతర విద్యార్థులు

రావడంతో తప్పిన ప్రమాదం

రాజానగరం: ప్రేమించిన తనను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన ఓ యువకుడు ఆ యువతిపై పెట్రోలు పోసి, అంటించబోయాడు. ఇతర విద్యార్థులు చూసి, అతన్ని వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఇదే సమయంలో అతను వెలిగించబోయిన లైటర్‌ వెలగకపోవడం ఆమె అదృష్టం. ఓ కాలేజీలో చదువుతున్న కోనసీమకు చెందిన యువతిని చొప్పెల్లకు చెందిన యర్రంశెట్టి లోకేష్‌ ప్రేమించాడు.

మూడేళ్లు చదివి మానేసిన లోకేష్‌ ప్రవర్తన నచ్చక అతన్ని ఆ యువతి దూరం పెట్టింది. అయినప్పటికీ ఆమెను వెంటపడి వేధించడం మానకపోవడంతో కాకినాడకు మకాం మార్చి అక్కడ లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ ఆమె చదువుకుంటోంది. ఈ క్రమంలో పరీక్షలు రాసేందుకు రాజానగరంలో ఓ కాలేజీకి వచ్చిన ఆమెను కాలేజీ ప్రాంగణంలోకి బైకుపై వచ్చిన లోకేష్‌ జుట్టు పట్టుకుని బలవంతంగా పక్కకు తీసుకువెళ్లి, ఆమె పై పెట్రోలు పోసి, లైటర్‌తో అంటించబోయాడు.

ఆ లైటర్‌ వెలగకపోవడంతోపాటు ఆమె పెట్టిన అరుపులకు సమీపంలో ఉన్న ఇతర విద్యార్థులు పరుగున వచ్చి లోకేష్‌ని వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఆ తరువాత అక్కడ నుంచి పారిపోయిన నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపించామని ఎస్సై ప్రియకుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement