మద్యం అక్రమ తయారీపై కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

మద్యం అక్రమ తయారీపై కఠిన చర్యలు

Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM

రాజమహేంద్రవరం రూరల్‌: మద్యం అక్రమ తయారీ, బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కమిషనర్‌ శ్రీధర్‌ ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఎకై ్సజ్‌ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్‌ విధానం అమలు తీరు, ఆదాయ వృద్ధి, నేరాల నియంత్రణ తదితర అంశాలపై శ్రీధర్‌ విశ్లేషించారు. అనుమతులు పొందిన మద్యం షాపులు, బార్లలో తనిఖీలు నిర్వహించాలని, సమయ పాలన పాటించేలా చూడాలన్నారు. అక్రమ మద్యం నియంత్రణలో విఫలమయ్యే అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంగళగిరి ప్రొహిబిషన్‌– ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ వై.చైతన్య మురళి, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం.వినయ్‌ బాబు, జిల్లా ఎకై ్సజ్‌ అధికారులు వై.శ్రీలత, ఆర్‌ఎస్‌ కుమారేశ్వరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement