మోతుగూడెం: లోయర్ సీలేరు డొంకరాయి జలాశయం ప్రమాదకర స్థాయికి చేరడంతో రెండు రోజుల నుంచి డ్యామ్ ఆరో నంబర్ గేటు ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డొంకరాయి ఎగువన ఉన్న సీలేరు జల విద్యుత్ కేంద్రంలో నిరంతరాయంగా జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడంతో డొంకరాయి డ్యామ్‌లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఏడీఈ శివశంకర్ తెలిపారు. బుధవారం సాధారణ స్థాయికి చేరడంతో సాయంత్రం గేటు మూసివేసినట్లు ఆయన వివరించారు. డొంకరాయి జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా 1035 అడుగులకు చేరుకుంది.


