పిచ్చికుక్క స్వైర విహారం | - | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క స్వైర విహారం

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

పి.గన్నవరం: మండల కేంద్రం పి.గన్నవరంలో బుధవారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకూ కనిపించిన వారిని కరుస్తూ భయబ్రాంతులకు గురి చేసింది. మొత్తం ఆరుగురిని గాయపరిచింది. రెండు కుక్క పిల్లల్ని కూడా హతమార్చింది. తొలుత స్థానిక మూడు రోడ్ల సెంటర్లో కొప్పాడి నాగలక్ష్మి, అనంతరం శివాలయం వెనుక రోడ్‌లో పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న బెజవాడ గీతిక అనే 7వ తరగతి విద్యార్థినితో పాటు, ఆమె కూడా వెళ్తున్న డిగ్రీ విద్యార్థిని జి.శ్రీనివాస మంగతాయారును, బాలురు ఎస్‌హెచ్‌ఎస్‌ సాయి, కోట ఏసేబు, మరో వ్యక్తి ఐ.మణికంఠను తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రులకు పి.గన్నవరం సీహెచ్‌సీలో డాక్టర్‌ వందన వైద్య సేవలు అందించారు. ఇందులో ఏసేబు, గీతిక, నాగలక్ష్మి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. చివరికి స్థానిక అంబేడ్కర్‌ కాలనీలో స్థానికులు పిచ్చికుక్కను హతమార్చారు. అలాగే రాజులపాలెం గ్రామంలో ఎం.సత్యవతి, బెల్లంపూడిలో డి.వీరేంద్రలను కుక్కలు కరవడంతో పి.గన్నవరంలో చికిత్స పొందారు. బుధవారం 9 డాగ్‌ బైట్‌ కేసులకు వైద్య సేవలు అందించినట్టు డాక్టర్‌ వందన తెలిపారు.

ఆరుగురికి తీవ్ర గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement