‘దొర’తనాన్ని సహించలేక..
అయితే, తరచూ ఇలా మాట్లాడటం వర్మకు ఫ్యాషన్ అయిపోయిందని జనసేన నేతలు కొట్టిపారేస్తున్నారు. బాబు ఫొటో వివాదం కేవలం సాకు మాత్రమేనని ఇరు పార్టీల్లోని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. అటు వర్మ, ఇటు దొరబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలే. సహజంగానే ఎవరి స్థాయిలో వారికి అనుచరగణం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌కు వ్యతిరేకంగా పని చేసిన దొరబాబు అకస్మాత్తుగా జనసేనలోకి వచ్చీ రాగానే పెత్తనం చెలాయించడం వర్మ, ఆయన వర్గీయులకు ఎంతమాత్రం రుచించడం లేదు. టీడీపీ మద్దతు లేకపోతే పవన్‌కు అంత మెజార్టీ వచ్చేది కాదని వర్మ పదేపదే అంటున్నారు. తాజా వివాదంలో కూడా ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్‌కు వెన్నుపోటు పొడిచి వచ్చిన దొరబాబుపై తీవ్ర ఆరోపణలు చేయడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. నాడు దొరబాబు సాగించిన రూ.150 కోట్ల అవినీతి, అక్రమాలను రికార్డులతో సహా బయటపెడతానని, ఈ అవమానాలను భరించే ఓపిక ఇక లేదని, కలబడితే గాజులు తొడుక్కుని కూర్చునేది లేదని, రేపు ఎలా ఉంటుందో చూద్దామంటూ ఘాటైన పదజాలాన్ని ఉపయోగించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
ఫ పిఠాపురంలో పెత్తనం కోసం
తరచూ తగాదాలు
ఫ చంద్రబాబు ఫొటో లేదంటూ తాజాగా మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపాటు
ఫ ఆయనను తోసేసిన మరో మాజీ..
పెండెం దొరబాబు
ఫ ఇరు వర్గాల మధ్య బాహాబాహీ
ఫ డిప్యూటీ సీఎం ఇలాకాలో
పదేపదే వివాదాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు సారథ్యంలో కూటమి కట్టిన టీడీపీ, జనసేన నేతలు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకుంటున్నారు. పైకి పొత్తులంటూనే కత్తులు దూస్తున్నారు. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జనసేన, టీడీపీ ముఖ్య నేతలు నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నారు. కూటమి గద్దెనెక్కిన దాదాపు రెండేళ్లుగా నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పిఠాపురం మున్సిపల్ కల్యాణ మండపంలో జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం, జనవరిలో మూడు రోజుల పాటు జరిగిన సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం చంద్రబాబు ఫొటో పెట్టకపోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. అయినప్పటికీ అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండన్న చందంగా గుడ్లప్పగించి చూస్తున్నారు. ఇరు పార్టీల నేతల మధ్య సఖ్యత కోసం వీసమెత్తు కూడా ప్రయత్నించిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో తాజాగా మరో రచ్చ చోటు చేసుకుంది.
తారస్థాయికి..
పట్టణంలోని పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం వద్ద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, బ్యానర్లపై కూడా చంద్రబాబు ఫొటో పెట్టకపోవడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయనను జనసేనకు చెందిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నెట్టేసే ప్రయత్నం చేశారు. దీంతో, ఇరు పార్టీల నేతల మధ్య అరుపులు, కేకలతో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఇరుపక్షాలూ బాహాబాహీకి దిగాయి. ఈసారి వర్మపై జనసేన వైపు నుంచి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు దూకుడు ప్రదర్శించడం చూస్తూంటే వారిద్దరి మధ్య రాజకీయ వైరం తారస్థాయికి చేరిందని చెప్పుకొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆయన ఫొటోకు ప్రాధాన్యం ఇచ్చినా చంద్రబాబు ఫొటో కూడా పెడుతున్నామన్నది జనసేన నేతల వాదనగా ఉంది. ఏదో ఒక అంశాన్ని ఆసరాగా చేసుకుని వర్మ తరచూ రాద్ధాంతం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే, నియోజకవర్గం ఏదైనా ముఖ్యమంత్రి చంద్రబాబుకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలనేది వర్మతో పాటు టీడీపీ నేతలు డిమాండ్‌గా ఉంది. అధికారిక కార్యక్రమాల్లో కావాలనే చంద్రబాబు ఫొటో పెట్టకుండా అవమానిస్తున్నారనేది వర్మ వాదన. ఒకటీ రెండు కాదు నాలుగైదు పర్యాయాలుగా ఇలానే అవమానిస్తున్నారని, దీనికి అధికారులు కూడా వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా సంఘటనతో ఆయన అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు.
చోద్యం చూస్తున్న అగ్ర నేతలు
నియోజకవర్గంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చోద్యం చూస్తున్నారంటూ ఇరు పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి కూటమి గద్దెనెక్కిన తొలినాళ్లలో జనసేన నేతలతో చెట్టపట్టాలేసుకుని తిరిగిన వర్మ.. చంద్రబాబు ఆశీస్సులతో తొలి ఎమ్మెల్సీ సదవి వస్తుందని గట్టిగా నమ్మారు. కానీ, ఆయన ఆశలు అడియాశలే అయ్యాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురం నియోజకవర్గంలో రెండో పవర్ సెంటర్ వస్తుందనే ఉద్దేశంతో బాబు, పవన్ కూడబలుక్కునే మోకాలడ్డారని టీడీపీ నేతలు చాలా కాలంగా విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు జనసేనలో దొరబాబు చేరిన తదనంతర పరిణామాల్లో ఇరు పార్టీల నేతల మధ్య వర్గాలకు మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. నియోజకవర్గంలో టీడీపీ ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నాలను అడ్డుకుంటున్నామని వర్మ, అసలు వర్మకు మునుపటి బలగం లేనేలేదని దొరబాబు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. ఎన్నికలప్పుడున్న జనసేన శ్రేణులతో తనకు పొరపొచ్చాలు లేవని వర్మ అంటున్నారు. దొరబాబు వెంట వచ్చిన కొత్త జనసేన కేడర్‌తోనే సమస్య మొదలైందని తాజా ఘటన నేపథ్యంలో ఆయన చెప్పడం దీనికి బలం చేకూరుస్తోంది.
పొత్తు ధర్మం పాటించరా?
పిఠాపురంలో జనసేన పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో జనసేన నేతల నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏ రకంగా చూసినా నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యం లేకపోవడమే కాకుండా కనీసం విలువ కూడా లేకుండా చేస్తున్నారంటూ రగిలిపోతున్నాయి. చంద్రబాబు సీఎంగా గద్దెనెక్కినా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం టీడీపీ ప్రతిపక్ష పాత్రనే పోషించాల్సి వస్తోందని వర్మ సహా ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎంత ప్రాతినిధ్యం వహిస్తూంటే మాత్రం జనసేన నేతలు టీడీపీని ఇంత దారుణంగా అవమానిస్తారా అని తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. వారు మరోసారి ఏకపక్షంగా వ్యవహరిస్తూ అవమానిస్తే ఉపేక్షించేది లేదని వర్మ చేసిన హెచ్చరికలు భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.


