దేవీపట్నం: పది రోజుల విరామం అనంతరం పులి మళ్లీ పోలవరం జిల్లాలోకి అడుగుపెట్టింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తూరు వద్ద ఆదివారం రాత్రి గోదావరి దాటి దేవీపట్నం మండలం లింగవరం వద్దకు చేరిన ఈ పులి దండంగి వాగు దాటుకుని తిరిగి నాగళ్లపల్లికి చేరింది. ఇది మంగళవారం సాయంత్రానికి నాగళ్లపల్లి వద్ద కొండపై ఉన్నట్లు ట్రాకర్ ద్వారా అటవీ సిబ్బంది గుర్తించారు. సమీప గ్రామాలైన చిన్నారిగండి, దేవారం ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ పులి మంగళవారం రాత్రికి కొండ దిగి అటు రామదుర్గం మీదుగా సీతానగరం వైపు లేదా దేవారం, శరభవరం గ్రామాల వైపు మరలే అవకాశం ఉంది. ముంపు గ్రామాల్లోని జీడిమామిడి తోటల్లోకి రైతులు వెళ్లవద్దని అటవీ అధికారులు సూచించారు.


